Airtel Free Offers: మార్కెట్‌లో రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా నుంచి ఉన్న పోటీని ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇప్పుడు తాజాగా ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ యాజర్లకు అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ లాంచ్ చేసింది ఎయిర్‌టెల్. ఈ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎయిర్‌టెల్ అందిస్తున్న అన్‌లిమిటెడ్ 5జి డేటా ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లు ఇరువురికీ వర్తిస్తుంది. 239 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ యాక్టివ్ డేటా ప్లాన్ ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. 5జీ నెట్‌వర్క్ ఉన్నచోట కస్టమర్లు ఈ ఆఫర్‌ను అపరిమితంగా ఎంజాయ్ చేయవచ్చు. అన్‌లిమిటెడ్ 5జి డేటా ఆఫర్‌తో పాటు ఇంకా ఇతర ప్రయోజనాల్ని కూడా ఎయిర్‌టెల్ అందిస్తోంది. సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ పెంచుకునేందుకు కొన్ని సెలెక్టెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఇస్తోంది. ఓటీటీ కోసం ఎదురుచూసేవారికి ఇదే మంచి అవకాశం. ఉచితంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సేవల్ని 5జీలో ఎంజాయ్ చేయవచ్చు. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే అన్‌లిమిటెడ్ 5జి డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్, అదనపు లాభాల గురించి తెలుసుకుందాం..


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లభించే ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే


ఎయిర్‌టెల్ 399 ప్లాన్


ఎయిర్‌టెల్‌లో 399 రూపాయల ప్లాన్ అనేది 28 రోజుల వ్యాలిడిటీకు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ వెర్షన్ 3 నెలలు ఉచితంగా అందుతుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2.5 జీబీ డేటా ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్లాన్‌లో అపోలో సబ్‌స్క్రిప్షన్ , ఇతర ప్రయోజనాలు లభిస్తాయు. 


ఎయిర్‌టెల్ 499 ప్లాన్


ఇది 28 రోజులకు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 3 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉన్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ వెర్షన్ 3 నెలలకు లభిస్తుంది. దీంతోపాటు హెలో ట్యూన్స్ వంటి ఇతర ప్రయోజనాలుంటాయి.


ఎయిర్‌టెల్ 839 ప్లాన్


ఈ ప్లాన్ 84 రోజులకు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కలుగుతుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ వెర్షన్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 


ఎయిర్‌టెల్ 3359 ప్లాన్


ఈ ప్లాన్ 365 రోజులకు వర్తిస్తుంది. అంటే ఏడాది పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ సమయంలో రోజుకు 2.5 జీబీ డేటా రోలోవర్, ఎస్ఎంఎస్, కాలింగ్ ప్రయోజనాలుంటాయి. కస్టమర్లకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో 1 ఏడాది మొబైల్ వెర్షన్ ఉచితంగా లభిస్తుంది. 


Also read: Navratri Flipkart Discount offers: మీకిష్టమైన ఐఫోన్ 11 కేవలం 13 వేలకే, ఆఫర్ ఎలాగో తెలుసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook