Bharti Airtel plans to hikes tariff rates by mid 2023: దేశీయ దిగ్గజ టెలికం కంపెనీల్లో 'భారతీ ఎయిర్‌టెల్' ఒకటిగా కొనసాగుతూ వస్తోంది. దేశంలో అత్యధిక కస్టమర్లు ఎయిర్‌టెల్‌కు ఉన్నారు. అగ్ర స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్.. తమ ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి ప్రణాళికలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా తన కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే అన్ని రకాల రీచార్జ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్.. మరోసారి రీఛార్జ్‌ ధరలను పెంచనుందట. దాంతో యూజర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023 మధ్యలో టారిఫ్ ఛార్జీలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు భారతీ ఎయిర్‌టెల్ సీఈవో సునీల్ భారతీ మిత్తల్ ఓ ప్రకటనలో తెలిపారు. టెలికాం పరిశ్రమ వ్యాపారంలో మూలధన రాబడి తక్కువగా ఉన్న కారణంగానే టారిఫ్ ఛార్జీలను స్వల్పంగా పెంచే అవకాశం ఉందన్నారు. నిత్యం వాడే వస్తువులపై ప్రజలు చేస్తున్న ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ ఎయిర్‌టెల్ సీఈవో పేర్కొన్నారు. దేశానికి బలమైన టెలికాం సంస్థ అవసరమని, భారత్ డిజిటల్-ఆర్థిక వృద్ధి కల సాకారమైనట్లు చెప్పారు. 


భారతీ ఎయిర్‌టెల్ గత నెలలో 28 రోజుల ప్లాన్ కోసం కనీస రీఛార్జ్ ధరను 57 శాతం పెంచింది. దీంతో కంపెనీ కనీస నెలవారీ రీచార్జ్ ధర ఇప్పుడు రూ. 155కు చేరింది. ఇందులో కస్టమర్లకు 1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. ఈ రీచార్జ్ వాలిడిటీ 28 రోజులు. కంపెనీ రీచార్జ్ ధరల పెంపు నిర్ణయం దాదాపు 8 సర్కిళ్లలో అమలులోకి వచ్చింది. కర్నాటక, ఏపీ, బీహార్, యూపీ వంటి సర్కిళ్లు ఇందులో ఉన్నాయి. అదేసమయంలో రూ. 99 కనీస రీఛార్జీ ప్లాన్‌ను కూడా నిలిపివేసింది. త్వరలో టారిఫ్ ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. దాంతో ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్ తగలనుంది. 


Also Read: Dinesh Karthik: ఆ ఒక్క టోర్నీ నా జీవితాన్నే ఆగం చేసింది.. ఎంఎస్ ధోనీ మేనియా ముందు నిలవలేకపోయా: దినేశ్ కార్తిక్‌  


Also Read: NZ vs ENG: టెస్టు క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ మ్యాచ్.. ఒక్క పరుగు తేడాతో ఇంగ్లండ్ ఓటమి! మూడో జట్టుగా కివీస్‌ రికార్డు   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.