Amazon Fab Phone Fest: రూ.32,000 విలువైన మొబైల్ ఇప్పుడు రూ.1,649కే అందుబాటులో!
Amazon Fab Phone Fest: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్ల ఫెస్ట్ సేల్ జరుగుతోంది. ఇందులో మీరు మీకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దాదాపు రూ. 32,000 విలువైన Xiaomi కంపెనీకి చెందిన 5G స్మార్ట్‌ఫోన్ ను ఇప్పుడు రూ. 1,649 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Amazon Fab Phone Fest: ఈ - కామర్స్ దిగ్గజం అమెజాన్ వెబ్ సైట్ లో ప్రస్తుతం ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరిట సేల్ నడుస్తోంది. ఈ సేల్ ద్వారా స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపును అమెజాన్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీకు ఇష్టమైన మొబైల్స్ ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్పెషల్ సేల్ ద్వారా రూ. 31,999 విలువైన Xiaomi 5G స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 1,649 కే కొనుగోలు చేసేందుకు ఉపాయం ఉంది. అదేంటో మీరూ తెలుసుకోండి.
Xiaomi 5G స్మార్ట్‌ఫోన్ పై ఆఫర్స్
Xiaomi 11 Lite NE 5G స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం మార్కెట్లో రూ. 31,999 ధరకు అందుబాటులో ఉంది. కానీ, ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 5,000 డిస్కౌంట్ తో అంటే రూ. 26,999 ధరకు అమెజాన్ వెబ్ సైట్ లో విక్రయిస్తున్నారు. ఈ డీల్ పై అనేక బ్యాంకు ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ఈ కొనుగోలుపై HDFC బ్యాంకు కార్డును ఉపయోగించడం వల్ల అత్యధికంగా రూ. 4,500 వరకు తగ్గింపు పొందేందుకు అవకాశం ఉంది. దీని తర్వాత మొబైల్ కొనుగోలు ధర రూ. 22,499 వద్దకు చేరుతుంది. ఓ కూపర్ ద్వారా రూ. 1,000 డిస్కౌంట్ తో అది కాస్త రూ. 21,499కు చేరుతుంది.
ఈ డీల్ పై చివరిగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంది. Xiaomi 11 Lite NE 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై మీ పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా అత్యధికంగా రూ. 19,850 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే అది మీ పాత మొబైల్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ను కూడా పూర్తిగా పొందితే.. దీన్ని కేవలం రూ. 1,649 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Xiaomi 11 Lite NE 5G ఫీచర్లు
డిస్ ప్లే - 6.55-అంగుళాల FHD + OLED డాట్ డిస్ ప్లే
స్టోరేజ్ - 6 GB RAM, 128 GB ROM
ప్రాసెసర్ - Qualcomm Snapdragon 778G
కెమెరా - 64MP (మెయిన్ సెన్సార్), 20MP (ఫ్రంట్ కెమెరా)
రిఫ్రెష్ రేట్ - 90Hz
సౌండ్ అవుట్ పుట్ - డాల్బీ విజన్ సపోర్ట్.
ALso Read: Smart TV Offers: రూ.7,749 ధరకే 42 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయండి!
Also Read: PF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు ఊహించని షాక్.. వడ్డీ రేట్లను తగ్గించిన ఈపీఎఫ్ఓ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook