Amazon Offers: శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే మీకు గుడ్‌న్యూస్. శాంసంగ్ 4 కెమేరాల అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఉంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకవేళ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే..ఇదే అద్భుతమైన అవకాశం. అమెజాన్‌లో ఇప్పుడు ఫ్రీడమ్ ఫెస్టివల్ నడుస్తోంది. ఇందులో హోమ్ అప్లయన్సెస్ నుంచి స్మార్ట్‌ఫోన్ల వరకూ అన్నింటిపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఇందులో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎం33 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్, ఫీచర్ల గురించి తెలుసుకుందాం..


శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జి లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌‌డి ప్లస్ ఇన్‌ఫినిటీ వీ డిస్‌ప్లే ఉంది. ఇందులో ఆక్టా కోర్ 5ఎన్ఎం ఎక్సినోస్ ప్రోసెసర్, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంది. ఎం33 5జిలో క్వాడ్ రేర్ కెమేరా సెటప్..50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 120 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మైక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ప్రత్యేక ఆకర్షణలు. మరోవైపు సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఈ ఫోన్ 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ సూపర్ ఛార్జింగ్‌తో వస్తుంది. 


ఇక ఈ ఫోన్‌ను అమెజాన్‌లో కేవలం 18 వేల 999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర 24 వేల 999 రూపాయలు. ఆగస్టు 10 వరకూ ఉండే ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఈ ఫోన్ పై 6 వేల వరకూ ఆదా చేయవచ్చు. ఇది నిజంగానే అద్భుతమైన డిస్కౌంట్. 


Also read: August Bank Holidays 2022: వచ్చేవారం బ్యాంకు పనులుంటే ఇబ్బందే, వారంలో ఆరు రోజులు సెలవులే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook