Amazon sale: ఇయర్ బడ్స్‌పై అమెజాన్ అదిరే డిస్కౌంట్లు- పూర్తి వివరాలివే..
Amazon sale: మొబైల్ యాక్సెసిరిస్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. మొబైల్ యాక్సెసిరిస్ డేస్ పేరుతో నిర్వహిస్తున్న సేల్‌లో భాగంగా ఈ ఆఫర్లు ఇస్తోంది. ఈ సేల్‌లో డిస్కౌంట్లు ఇలా ఉన్నాయి.
Amazon sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఎప్పుడు వినియోగదారులకోసం ఓ స్పెషల్ సేల్ నిర్వహింస్తుంటుంది. ఇందులో భాగంగా ఇటీవల మొబైల్ యాక్సెసరిస్ డేస్ సేల్‌ను ఏప్రిల్ 14న ప్రారంభించింది. ఈ సేల్ నేటితో (ఏప్రిల్ 17) ముగియనుంది.
ఏమిటి ఈ సేల్?
ప్రతిసారి మొబైల్ ఫోన్లు, టీవీల వంటి వాటిపై డిస్కౌంట్లతో సేల్ నిర్వహించే అమెజాన్ ఈ సారి కాస్త భిన్నంగా.. యాక్సెసిరిస్లకోసం ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లకు అవసరమయ్యే అన్ని రకాల యాక్సెసిరిస్లు.. అంటే బడ్స్, పవర్ బ్యాంక్స్, ఛార్జర్లు, ఛార్జింగ్ కేబుల్స్, బ్లూటూక్ బ్యాండ్స్ సహా ఇతర గాడ్జెట్స్‌పై భారీ తగ్గింపు ఇస్తోంది అమెజాన్.
ఈ స్పెషల్ సేల్‌లో భాగంగా రూ.99 యాక్సెసిరిస్ల కనీస ధరను రూ.99గా నిర్ణయించింది. అంతే కాదు.. ఈ స్పెషల్ సేల్‌లో కొన్ని యాక్సెసిరిస్లపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
యాపిల్, వన్‌ప్లస్, ఒప్పొ, మివి, పిట్రోన్, రియల్మీ, బోట్, జేబీఎల్ సహా ఇతర అన్ని బ్రాండెట్ కంపెనీల ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది అమెజాన్.
కొన్ని ఆఫర్లు ఇలా..
వన్‌ప్లస్ వైర్లెస్ జెడ్2 బ్లూటూత్ హెడ్సెట్ ధర రూ.2,299 కాగా ఈ సేల్‌లో దీనిని రూ.1,999కే సొంతం చేసుకునే వీలుంది.
ఒప్పొ ఎన్కొ ఎం32 బ్లూటూత్ ధరను రూ.1,699కి తగ్గించింది అమెజాన్. దీని అసలు ధర రూర.2,999.
వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 ధరనూ రూ.5,999 నుంచి రూ.4,999కి తగ్గించింది.
శాంసంగ్ గెలాక్సీ బడ్స్ప్రో ధరను భారీగా తగ్గించింది. దీని అసలు ధర రూ.17,990గా ఉండగా.. ఈ సేల్‌లో రూ.8,490కే కొనుగోలు చేసే వీలుంది.
బ్యాంక్ ఆఫర్ కూడా..
ఈ సేల్‌లో ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డును ఉపయోగించి, అమెజాన్ పే ద్వారా చెల్లింపులు జరిపితే.. 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చని అమెజాన్ తెలిపింది. కేవలం అమెజాన్‌పే యూపీఐ ద్వారా జరిపే కొనుగోళ్లకు రూ.50 క్యాష్ బ్యాక్ లభిస్తుందని వివరించింది. వీటన్నింటితో పాటపు పోస్ట్‌పే కార్డ్‌తో చెల్లింపులు జరిపితే 10 శాతం (గరిష్ఠంగా రూ.200) తక్షణ క్యాష్ బ్యాక్ పొందొచ్చు.
Also read: GST Council: జీఎస్టీ కనీస శ్లాబు 5 శాతం నుంచి పెంపు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook