Amazon Mobile Offers: డెడ్ చీప్.. రూ.17 వేలు విలువ చేసే 5జీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.999కే..
Amazon Mobile Offers: బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే అమెజాన్‌లో మీకోసం అద్భుతమైన ఆఫర్స్ వేచి చూస్తున్నాయి.
Amazon Mobile Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో అతి చౌక ధరకే అమెజాన్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో రెడ్‌మీ నోట్ 10టీ 5జీ (క్రోమియమ్ వైట్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ)పై బిగ్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటే రూ.17 వేలు విలువ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌ని డెడ్ చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్‌లో 29 శాతం డిస్కౌంట్ ఆఫర్
రెడ్‌మీ నోట్ 10టీ 5జీ (క్రోమియమ్ వైట్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ) సాధారణ ధర రూ.16,999. అమెజాన్ దీనిపై 29 శాతం తగ్గింపు అందిస్తోంది. అంటే దాదాపు రూ.5 వేల వరకు ఆదా అవుతుంది. అలా డిస్కౌంట్ ద్వారా రూ.11,999కే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు మీరు ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు ఉపయోగించినట్లయితే.. మరో రూ.1 వెయ్యి వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మరింత చౌకగా రూ.10,999కే ఈ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.
ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో డెడ్ చీప్ ధరకే :
రెడ్‌మీ నోట్ 10టీ 5జీ (క్రోమియమ్ వైట్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని మార్చుకున్నట్లయితే.. దాని కండిషన్‌ని బట్టి గరిష్ఠంగా రూ.11 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ పూర్తిగా వర్తించినట్లయితే రూ.11,999కి అందుబాటులో ఉన్న రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్‌ని డెడ్ చీప్‌గా రూ.999కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లకు షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి.
రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ఫీచర్స్ :
మిడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టా కోర్ 7ఎన్ఎం ప్రాసెసర్
2.2 జీహెచ్‌జెడ్ క్లాక్ స్పీడ్, డ్యూయల్ 5జీ సపోర్ట్
డిస్‌ప్లే 6.5 అంగుళాలు
48మెగా పిక్సెల్ కెమెరా సెన్సార్
2 ఎంపీ మాక్రో కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ 5000 mAh
Also Read: Akshay Kumar: చరణన్న అంటూ అక్షయ్ కామెంట్స్.. ఆడుకుంటున్న మెగాఫాన్స్
Also Read: Minister sabitha: తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook