Xiaomi 11 Lite NE 5G Amazon Offer: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్' మొబైల్ ఫోన్‌లపై అద్భుత ఆఫర్లను ప్రకటించింది. చాలా మొబైల్‌లపై రాయితీలతో పాటు ఈఎంఐ, ఎక్స్ ఛేంజ్ ఆఫర్లను ఉంచింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈపై 7 వేల ఆఫర్ ప్రకటించింది. షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ అసలు ధర 33,999గా ఉండగా.. అమెజాన్‌ 7 వేల ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.26,999లకు అందుబాటులో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈపై 7 వేల ఆఫర్ మాత్రమే కాకుండా.. ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది. ఈఎంఐ 1,271తో ఆరంభం కానుంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ 5,000గా ఉంది. ఎక్స్ చేంజ్ పోను ఈ మొబైల్ రూ.19,900కు లభిస్తుంది. అంతేకాదు 11 లైట్ 5జీ ఎన్ఈపై బ్యాంకు ఆఫర్స్, పాట్నర్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు మరో 12 గంటల్లో ముగియనున్నాయి. 


షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్ ఫోన్ భారత దేశంలో 2021 సెప్టెంబర్ 29వ తేదీన లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై 7 వేల ఆఫర్ ఉండగా..  8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై 5 వేల ఆఫర్ ఉంది. రూ.26,999, రూ.28,999 ధరలకు ఈ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. 


ఆండ్రాయిడ్ 11 ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 10-బిట్ ఫ్లాట్ ట్రూ కలర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్ కాగా.. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4250 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 5జీ, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్) బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 


Also Read: Petrol Price Hiked: బాప్‌రే.. లీటర్ పెట్రోల్ ధర @ రూ. 204.. ఎక్కడో తెలుసా..??


Also Read: పర్సు లాక్కోవాలని చూసిన ఇద్దరు దొంగలు.. వారి స్కూటీనే ఎత్తుకెళ్లిన సూపర్ గర్ల్! వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook