AMAZON Cricket Streaming: ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్​లో ఇక ఎంటర్​టైన్మెంట్ డబుల్ కానుంది. ఇప్పటి వరకు అమెజాన్​ ప్రైమ్​లో సినిమాలు, వెబ్​ సిరీస్​లు స్ట్రీమ్​​ చేసుకునేందుకు మాత్రమే వీలుండగా.. ఇప్పుడు క్రికెట్​ మ్యాచ్​లు చూసేందుకు వీలు (Cricket live streaming on Amazon Prime) కలగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రత్యేక ఒప్పందం..


క్రికెట్ మ్యాచ్​లను తమ ప్లాట్​ఫామ్​పై స్ట్రీమ్​ చేసేందుకు అమెజాన్​ ప్రైమ్​ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్​తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తాజాగా న్యూజిలాండ్​, బంగ్లాదేశ్​ (NZ vs BAN test match) మధ్య తొలి టెస్ట్ మ్యాచ్​ను తమ ఆన్​లైన్ వేదికలో ప్రత్యక్ష ప్రసారం చేసింది అమెజాన్​ ప్రైమ్​.



ఇకపై.. న్యూజిలాండ్​తో జరిగే అన్ని టెస్టులు, వన్డేలు, టీ20 మ్యాచ్​లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది అమెజాన్​ ప్రైమ్​. ఇతర దేశాలతోనూ ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుని క్రికెట్ స్ట్రీమింగ్​పై అమెజాన్​ ప్రైమ్ ప్రత్యేక దృష్టి సారించొచ్చని విశ్లేషకులు (Amazon Prime Cricket Live) అభిప్రాయపడుతున్నారు.


హాట్​స్టార్​కు గట్టి పోటీ?


ఓటీటీల్లో క్రికెట్ మ్యాచ్​లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న హాట్​స్టార్​కు అమెజాన్ ప్రైమ్​ గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. ఇతర దేశాల బోర్టులతోనూ అమెజాన్​ ప్రైమ్​కు ఒప్పందం కుదిరితే పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి.


Also read: LPG Price: న్యూ ఇయర్ రోజు గుడ్​ న్యూస్​- తగ్గిన ఎల్​పీజీ సిలిండర్ ధరలు!


Also read: ATM Charges : ఏటీఎం విత్ డ్రా కొత్త ఛార్జీలు.. నేటి నుంచి పెరగనున్న ఛార్జీలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook