LPG Price: కొత్త సంవత్సరం తొలి రోజు గుడ్ న్యూస్ చెప్పాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100కుపైగా తగ్గిస్తూ ఇండియన్ కార్పొరేషన్ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని (Commercial LPG Cylinder price Cut ) తెలిపింది.
అయితే సాధారణంగా వాడే వంట గ్యాస్ ధర (14.2 కేజీల)లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
కొత్త ధరలు ఇలా..
తాజా ధరల సవరింపుతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.102 తగ్గి (Commercial LPG Cylinder price) రూ.998.50 వద్దకు దిగొచ్చింది. చెన్నైలో ఈ ధర రూ.2,131గా ఉంది. ముంబయిలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,948.50 వద్దకు తగ్గింది. కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్ ధఱ రూ.32,076 వద్దకు చేరింది.
గత ఏడాది డిసెంబర్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.100 పెంచగా.. 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇళ్లల్లో వాడే వంట గ్యాస్ ధరలు చివరి సారిగా గత ఏడాది అక్టోబర్‌లో పెరిగాయి.
14.2 కేజీల సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి..
ఢిల్లీ, ముంబయిలలో 14.2 ఎల్పీజీ సిలిండర్ ధరలు రూ.900 వద్ద ఉన్నాయి. కోల్క్తాలో ఈ ధర రూ.926గా ఉంది. చెన్నైలో రూ.916 వద్ద కొనసాగుతోంది.
దేశంలో 14.2 ఎల్పీజీ సిలిండర్ బిహార్ రాజధాని పట్నాలో అత్యధికంగా ఉంది. ఇక్కడ సిలిండర్ ధర రూ.998 వద్ద కొనసాగుతోంది. మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అత్యల్పంగా రూ.906 వద్ద ఉంది.
Also read: ATM Charges : ఏటీఎం విత్ డ్రా కొత్త ఛార్జీలు.. నేటి నుంచి పెరగనున్న ఛార్జీలు
Also read: Todays Gold Rate: మరోసారి పెరిగిన బంగారం, దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook