Amazon Sale: సౌండ్ బార్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు- పూర్తి వివరాలు ఇవే..
Amazon Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్‌తో ముందుకొచ్చింది. ఈ సారి సౌండ్ బార్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్కు సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం.
Amazon Soundbar Days: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఎప్పుడు ఏదో ఒక్ ఆఫర్ నడుస్తుంది. తాజాగా 'సౌండ్‌బార్ డేస్' సేల్‌ను నిర్వహిస్తోంది. ఇటీవలి కాలంలో సౌండ్ బార్స్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా ఇళ్లల్లో భారీ సైజు టీవీలు వాడుతుండటం సహా మ్యూజిక్ లవర్స్ కూడా ఎక్కువగా సౌండ్బార్స్ను కొనుగోలు చేస్తుంటారు. దీనితో మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు అమెజాన్ ఇండియా 'సౌండ్‌బార్ డేస్' సేల్‌ను నిర్వహిస్తోంది.
సేల్ గురించి..
ఈ సేల్ ఫిబ్రవరి18న ప్రారంభమైంది. రేపటి వరకు (ఫిబ్రవరి 20) ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్‌లో ఫేమస్ కంపెనీలైన బోట్, జేబీఎల్, సోనీ సహా ఇతర బ్రాండ్ల సౌండ్బార్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్. 55 శాతం వరకు ఈ డిస్కౌంట్ ఇస్తోంది.
ఆఫర్లు ఇలా..
బోట్ అడ్వెంచర్ బార్ 1800 ఆఫర్ ధరను రూ.7,999గా నిర్ణయించింది కంపెనీ. ఈ బార్ ప్రీమియం లుక్‌తో ఇంటికి మరింత రిచ్ లుక్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ వీజువల్స్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరిస్తుంది.
సోనీ హెచ్‌టీ-ఎస్20ఆర్ డిస్కౌంట్ ధర రూ.17,990గా నిర్ణయించింది అమెజాన్ ఇండియా. దీనికి స్పీకర్స్ వెనకవైపు ఉంటుంది. ఈ స్పీకర్లు సినిమాటిక్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయి. ఇందులో నైట్, వాయిస్ మోడ్‌లను ఎంచుకునే సదుపాయం కూడా ఉంది.
జేబీఎల్ సినిమా ఎస్బీ110 బగార్ ధరను రూ.8,499కి తగ్గించింది అమెజాన్. ఇందులో 110 వాట్స్స్ పవర్ ఔట్పుట్, డాల్బీ డిజిటల్, సబ్ ఊఫర్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
బ్యాంక్ ఆఫర్లు..
అమెజాన్ డిస్కౌంట్లతో పాటు.. బ్యాంక్ ఆఫర్ కూడా పొందొచ్చు. ముఖ్యంగా సిటీ బ్యాంక్, ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా జరిపే ఈఎంఐ లావాదేవీలకు రూ.1,500 తక్షణ డిస్కౌంట్ లభించనుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఇస్తున్నాయి బ్యాంకులు.
Also read: Harley Davidson New Electric Bike: హార్లే డేవిడ్సన్ నుంచి మరో ఎలక్ట్రిక్ బైక్.. లాంచింగ్ ఎప్పుడంటే
Also read: Best Mobile Recharge Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో రోజూ 2GB Data
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook