Best Mobile Recharge Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో రోజూ 2GB Data

Best Mobile Recharge Plans: కరోనా మహమ్మారి కారణంగా ప్రారంభమైన వర్క్ ఫ్రం హోం ఇంకా చాలా విభాగాల్లో కొనసాగుతోంది. అందుకే గత కొన్ని నెలలుగా దేశంలో డేటా వినియోగం ఎక్కువైంది. ఈ నేపధ్యంలో దేశంలోని ప్రముఖ మొబైల్ కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు అందిస్తున్న బెస్ట్ ప్యాకేజెస్ గురించి తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 19, 2022, 11:49 AM IST
  • వర్క్ ఫ్రం హోం నేపధ్యంలో పెరిగిన డేటా వినియోగం
  • రోజుకు 2 నుంచి 3 జీబీ డేటా వరకూ వివిధ కంపెనీల రీఛార్జ్ ప్లాన్స్
  • రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీల బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే
Best Mobile Recharge Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో రోజూ 2GB Data

Best Mobile Recharge Plans: కరోనా మహమ్మారి కారణంగా ప్రారంభమైన వర్క్ ఫ్రం హోం ఇంకా చాలా విభాగాల్లో కొనసాగుతోంది. అందుకే గత కొన్ని నెలలుగా దేశంలో డేటా వినియోగం ఎక్కువైంది. ఈ నేపధ్యంలో దేశంలోని ప్రముఖ మొబైల్ కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు అందిస్తున్న బెస్ట్ ప్యాకేజెస్ గురించి తెలుసుకుందాం.

వర్క్ ఫ్రం హోం విస్తృతం కావడంతో డేటా వినియోగం అధికమైంది. వీడియో కాన్ఫరెన్స్, సాఫ్ట్‌వేర్ జాబ్స్, డిజిటల్ మీడియా జాబ్స్ చేసేవారికి నిర్ణీత వేగంతో డేటా అవసరమవుతోంది. ఈ క్రమంలో వివిధ కంపెనీలు అందిస్తున్న డేటా ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

రిలయన్స్ జియో ప్లాన్స్..719 రూపాయల ప్లాన్ ...84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది. రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమితమైన వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇక 299 రూపాయల ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది. రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు. అపరిమితమైన వాయిస్ కాల్స్ ఉంటాయి. 3 వేల 119 రూపాయయల ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది. రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. 2 వేల 879 రూపాయల ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది.1 వేయి 66 రూపాయల ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది. అపరిమిత వాయిస్ కాల్స్ ఉంటాయి. 799 రూపాయల ప్లాన్‌లో 56 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది. అపరిమితమైన వాయిస్ కాల్స్ ఉంటాయి.

ఇక ఎయిర్ టెల్ విషయానికొస్తే...299 రూపాయల ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు, అపరిమితమైన వాయిస్ కాల్స్ ఉంటాయి. ఇక 839 రూపాయల ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్‌లు, అపరిమితమైన వాయిస్ కాల్స్ ఉంటాయి. 549 రూపాయల ప్లాన్‌లో 56 రోజుల వ్యాలిడిటీ, 2 జీబీ డేటా, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు, అపరిమితమైన వాయిస్ కాల్స్ ఉంటాయి.

ఇక వోడాఫోన్ ఐడియాలో 359 రూపాయల ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు, అపరిమితమైన వాయిస్ కాల్స్ ఉంటాయి. 539 రూపాయల ప్లాన్‌లో 56 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, అపరిమితమైన వాయిస్ కాల్స్ ఉంటాయి. 839 రూపాయల ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్‌లు, అపరిమితమైన వాయిస్ కాల్స్ ఉంటాయి.

Also read: Phone Pe Offer: ఫోన్ పే సరికొత్త ఆఫర్, అలా చేస్తే ఏకంగా 5 లక్షల ప్రైజ్ మనీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News