ఆ క్రెడిట్ కార్డులను బ్యాన్ చేస్తోన్న అమెజాన్
Amazon to no more accept THIS credit card: వచ్చే ఏడాది జనవరి నుంచి యూకేలో వీసా క్రెడిట్ కార్డ్‌ల (Visa credit card) వినియోగంపై నిషేధం విధించనున్నట్లు తెలిపింది. అయితే అప్పటి వరకు మాత్రం ఆ క్రెడిట్ కార్డ్‌లతో షాపింగ్ చేసుకోవచ్చని సూచించింది.
Amazon to no more accept THIS credit card due to high transaction fees: ఈ.. కామర్స్ దిగ్గజం అమెజాన్.. క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి యూకేలో వీసా క్రెడిట్ కార్డ్‌ల (Visa credit card) వినియోగంపై నిషేధం విధించనున్నట్లు తెలిపింది. అయితే అప్పటి వరకు మాత్రం ఆ క్రెడిట్ కార్డ్‌లతో షాపింగ్ చేసుకోవచ్చని సూచించింది. వీసా క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపులపై భారీగా చార్జీలు వసూలు చేస్తుండటమే దీనికి కారణం. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి వీసా (Visa) క్రెడిట్ కార్డుల నుంచి పేమెంట్స్ నిలిపివేయాలని నిర్ణయించామని అమెజాన్ తెలిపింది.
కస్టమర్లు ఇక నుంచి వీసా కార్డుకు బదులుగా మాస్టర్ కార్డ్ (Mastercard), యూరో కార్డ్, అమెక్స్ క్రెడిట్ కార్డులను చెల్లింపులకు వినియోగించాలని అమెజాన్ సూచించింది. ఇక చాలా మంది మర్చంట్లు కూడా వీసా.. తన క్రెడిట్ కార్డు చెల్లింపులపై భారీగా ఫీజు వసూలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే అమెజాన్ తీసుకున్న నిర్ణయంపై స్పందించడానికి వీసా క్రెడిట్ కార్డు యాజమాన్యం అందుబాటులోకి రాలేదు.
Also Read : గురుద్వారాలో శుక్రవారం ముస్లింల ప్రార్థనలకు స్వాగతం పలికిన గురుద్వారా అసోసియేషన్
ఇంటర్‌చేంజ్ .. (ట్రాన్సాక్షన్‌పై చెల్లించే పర్సంటేజ్) రుసుములు ఎక్కువగా ఉండడంతో అమెజాన్ యూకేలోని వీసా క్రెడిట్ కార్డ్‌లను (credit card) బ్లాక్ చేయనుంది. ఇంటర్ చేంజ్ ఫీజ్ (Interchange fee) అంటే.. ఉదాహరణకు యుకే వారు అమెజాన్ వెబ్‌సైట్‌లో ఏదైనా వస్తువును వీసా క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. ఆ కొనుగోలుపై అమెజాన్ వీసా సంస్థకు ఇంటర్ చేంజ్ ఫీజ్ (Interchange fee) చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఇంటర్ చేంజ్ ఫీజు వల్ల సంస్థకు నష్టం కలుగుతోందని అమెజాన్ (Amazon) అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే వీసా కార్డ్‌లపై బ్యాన్ విధించనుంది.
Also Read : తల్లి సెల్ ఫోన్ తీసుకుందని మస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook