Who is Anant Ambani's Fiance Radhika Merchant: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి, ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రాధిక్ మర్చంట్‌ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. ఉదయ్‌పూర్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో ఇద్దరూ ఒకరి చేతికి మరొకరు ఉంగరాలు మార్చుకుని తమ పెళ్లిని నిశ్చయం చేసుకున్నారు. ఇక వారిద్దరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మనందరికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం గురించి తెలుసు కానీ రాధిక మర్చంట్ ఎవరో తెలియదు కదా అందుకే చాలా మంది అసలు ఆ రాధికా మర్చంట్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఆ సమాచారాన్ని మీకోసం అందిస్తున్నాం. రాధికా మర్చంట్ అనంత్ అంబానీకి చిన్ననాటి స్నేహితురాలు. రాధికా మర్చంట్ దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ అయిన బిలియనీర్ పారిశ్రామికవేత్త విరెన్ మర్చంట్ కుమార్తె, ఆమె తల్లి పేరు శైలా మర్చంట్. రాధిక చెల్లెలు పేరు అంజలి మర్చంట్.[[{"fid":"257613","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


రాధిక కుటుంబం గుజరాత్‌లోని కచ్‌కు చెందినది. ఇక రాధిక మర్చంట్ 18 డిసెంబర్ 1994న జన్మించగా ఆమెకు శాస్త్రీయ నృత్యం అంటే చాలా ఇష్టం, అందుకే ఆమె ఎనిమిదేళ్లుగా భరతనాట్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్ అకాడమీలో గురు భావ ఠక్కర్ ఆధ్వర్యంలో ఆమె శాస్త్రీయ నృత్య శిక్షణ తీసుకుంటున్నారు. అంతేకాదు మీ అందరికీ కనుక గుర్తుండి ఉంటే ఈ సంవత్సరం మేలో, ముఖేష్ అంబానీ - నీతా అంబానీ తమ కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్ కోసం అరంగేట్రం వేడుకలు కూడా నిర్వహించారు.


ఇక రాధిక మర్చంట్ న్యూయార్క్ యూనివర్సిటీలో తన చదువు పూర్తి చేసింది. రాధిక తన స్కూలింగ్ ముంబైలోని ఎకోల్ మోండియాల్ వరల్డ్ స్కూల్ అలాగే BD సోమని ఇంటర్నేషనల్ స్కూల్ లో పూర్తి చేసింది. తర్వాత 2017లో న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రురాలయ్యారు. తన చదువు పూర్తి చేసిన తర్వాత, ఆమె భారతదేశానికి వచ్చి, ఇండియా ఫస్ట్ ఆర్గనైజేషన్, దేశాయ్ & దేవాన్జీ వంటి సంస్థలలో ఇంటర్న్‌షిప్ చేసింది.[[{"fid":"257614","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఇక ఆ తరువాత ఆమె ముంబైలోని రియల్ ఎస్టేట్ కంపెనీ ‘ఇస్ప్రవా’లో జూనియర్ సేల్స్ మేనేజర్‌గా పనిచేసింది. ఆపై తన కుటుంబ వ్యాపారాలు చూసుకోవడం మొదలుపెట్టారు. ఇక రాధిక మర్చంట్‌కి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం అని ఆమె తన స్నేహితులతో కలిసి చాలాసార్లు ట్రెక్కింగ్‌కు కూడా వెళ్ళిందని తెల్సుతుంది. ఇక ఎక్కువగా ఆమె పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారని, ఆమె జంతు ప్రేమికురాలు అని కూడా చెబుతున్నారు. 2018లో, అనంత్ అంబానీతో రాధిక ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పటి నుంచి వీరి బంధంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


ఇక చాలా ఏళ్లుగా అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఫంక్షన్‌లో రాధిక కనిపిస్తూనే ఉంది. 2018లో ఇషా - ఆకాష్ అంబానీల నిశ్చితార్థం సమయంలో కూడా రాధిక చాలా యాక్టివ్‌గా కనిపించరు. నీతా అంబానీ, ఇషా అంబానీలతో కూడా రాధికకు చాలా సత్సంబంధాలు ఉన్నాయని, రాధిక సోషల్ మీడియా పేజీలో కూడా, నీతా మరియు ముఖేష్ అంబానీతో రాధిక ఉన్న చాలా ఫోటోలు ఉన్నాయని అంటున్నారు.


ఇక 2019లో వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే, ఆ తర్వాత రిలయన్స్ గ్రూప్ దీనిని పుకారు అని పేర్కొంది. ఈసారి అధికారిక సమాచారం వచ్చేసింది. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలో ఉన్న శ్రీనాథ్‌జీ ఆలయంలో రోకా కార్యక్రమం జరిగిందని అంబానీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే పరిమల్ నత్వానీ తన ట్వీట్‌లో తెలిపారు. అనంత్, రాధిక పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఇప్పటి దాకా అయితే ఎలాంటి సమాచారం లేదు.


Also Read: ఈడు ఎప్పుడు కాళీ చేస్తాడా ? కుర్చీ లాక్కునేద్దామా అని చూస్తున్నారు!


Also Read: 7th Pay commission Latest News: ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అప్‌డేట్.. ఈ రోజునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook