Bank Fraud: దేశంలో మరో భారీ బ్యాంకు మోసం బయటపడింది. గుజరాత్​ కేంద్రంగా పని చేస్తున్న ఏబీజీ షిప్​యార్డ్​ లిమిటెడ్ అనే సంస్థ ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియానికి రూ.22,842 కోట్ల రుణాలు ఎగ్గొట్టినట్లు తెలిసింది. దేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ సంస్థల్లో ఇదీ ఒకటి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ఏబీజీ షిప్​యార్డ్ మాజీ ఛైర్మన్​, ఎండీ రిషి కమలేషన్ అగర్వాల్ సహా పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది.


అగర్వాల్​తో పాటు.. సంస్థ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ సంతానం ముత్తస్వామి, డైరెక్టర్లు అశ్విని కుమార్​, సుశీల్ కుమార్ అగర్వాల్​, రవి విమల్​ నివేతియాలపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.


ఉద్దేశపూర్వక నేరం, నమ్మక ద్రోహం సహా వివిధ సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది సీబీఐ. ఈ కేసులో నిందితులులకు చెందిన 13 ప్రాంతాల్లో సోదాలు కూడా నిర్వహించినట్లు వివరించింది.


కేసు ఇలా..


2019 నంబర్​ 8న సంస్థపై ఎస్​బీఐ ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై 2020 మర్చి 12 పూర్తి వివరాలు సమర్పించాలని ఎస్​బీఐని కోరింది. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టులో మరో ఫిర్యాదు చేసింది ఎస్​బీఐ.


ఏడాదిన్నరకుపైగా ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత.. ఫిబ్రవరి 7న ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది.
28  బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఏబీజీ షిప్​యార్డ్ లిమిటెడ్​కు రుణాలు అందినట్లు ఈ విషయంపై అవగాహనున్న వ్యక్తులు తెలిపారు. ఇందులో ఎస్​బీఐ వాటానే అత్యధికంగా రూ.2468.51 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు.


బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న నిధులను.. దారిమళ్లించడం, అక్రమంగా వాడుకోవడం వంటివి చేశారని ఎర్నెస్ట్ అండ్ యంగ్ చేసిన ఫోరొన్సిక్​ ఆడిట్​లో తేలింది.


Also read: Flipkart Lenovo Laptop: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ. 19 వేల కంటే తక్కువ ధరకే ల్యాప్ టాప్!


Also read: Electric scooters: అదిరే ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు- బుకింగ్స్ షూరూ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook