Electric scooters: అదిరే ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు- బుకింగ్స్ షూరూ..!

Electric scooters: దేశీయ మార్కెట్లోకి మూడు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లను ఆవిష్కరించింది వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్‌ మొబిలిటీ. ఆ స్కూటర్ల ధర, కీ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2022, 08:18 PM IST
  • మార్కెట్లోకి మూడు కొత్త విద్యుత్ స్కూటర్లు
  • వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్‌ మొబిలిటీ
  • ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించినట్లు వెల్లడి
Electric scooters: అదిరే ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు-  బుకింగ్స్ షూరూ..!

Electric scooters: దేశీయ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ వార్డ్​విజార్డ్​ ఇన్నోవేషన్స్​ అండ్ మొబిలిటీ.. రెండు కొత్త హైస్పీడ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లను ఆవిష్కరించింది. వోల్ఫ్​+, నాను+ పేర్లతో ఈ స్కూటర్లను తీసుకొచ్చింది.

దీనితో పాటు. ఫ్లీట్​ మేనేజ్​మెంట్ ఎలక్ట్రిక్​ స్టూటర్​ డెల్​ గో అనే మరో మోడల్​ను ఆవిష్కరించింది. ఈ మూడూ హై స్పీడ్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్​లో ఈ మూడింటిని విడుదల చేసింది. డెల్ గో అనేది డెలివరీ వెహికిల్​గా, సరకు రవాణాకు ఉపయోగపడే విధంగా రూపొందించింది కంపెనీ.

డెల్‌ గో స్కూటర్‌ ధర రూ. 1,14,500గా నిర్ణయించింది కంపెనీ.

ఈ స్కూటర్లన్నింటిని గుజరాత్​లోని వడోదర ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్లు వార్డ్​విజార్డ్​ ఇన్నోవేషన్స్​ అండ్ మొబిలిటి తెలిపింది. ఈ మూడు స్కూటర్లకోసం దేశవ్యాప్తంగా కంపెనీ డీలర్​షిప్లలో బుకింగ్స్ కూడా​ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ స్కూటర్లన్నింటికి మూడు సంవత్సరాల వారంటీతో విక్రయించనున్నట్లు వెల్లడించింది.

వోల్ఫ్​+, నాను+ స్కూటర్ల గురించి..

వోల్ఫ్​+ విద్యుత్ స్కూటర్​..టౌరింగ్ డిజైన్​తో సిటీ ఔట్​స్కట్స్​లో నడిపించేందుకు అనుకూలంగా అభివృద్ధి చేశారు. ఇక నాను+ వేరియంట్​ను యువతను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేశారు.

వోల్ఫ్‌+ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ.1,10,185గా కంపెనీ నిర్ణయించింది.

వోల్ఫ్​+ ఎత్తైన, వైడల్పైన సీట్​తో అందుబాటులోకి తేనుంది. 740 ఎంఎఁ ఎత్తు, 134 ఎంఎం ఎక్స్​టెండెడ్ వీల్​ బేస్​తో ఇది అందుబాటులో ఉంటుంది.

నెక్ట్స్​ జెన్​ నాను+ సీటు ఎత్తు 730 ఎంఎం, వీల్​ బేస్​ 132 ఎంఎంగా ఉంటుంది.

నాను+ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధరను రూ. 1,06,991గా ఉంచింది కంపెనీ.

ముందు వైపు చక్రానికి  డ్యూయల్​ ఫోర్క్​ హైడ్రాలిక్ సస్పెన్షన్​. వెనక చక్రానికి మోనో షాక్ సర్పెన్షన్​ ఉంటుంది. కీలెస్​ స్టార్ట్​, స్టాప్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది.

వీటితో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్లను అభివృద్ధి చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ల డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంబమవుతాయనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Also read: Paytm cashback offer: రూ. 4 ట్రాన్స్‌ఫర్‌ చేయండి.. రూ. 100 క్యాష్‌బ్యాక్‌ పొందండి!

Also read: POCO A3 Pro 5G: రూ.17,999 విలువైన 5జీ స్మార్ట్​ఫోన్​ రూ.249కే సొంతం చేసుకోండిలా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News