శాన్‌ఫ్రాన్సిస్కో: యాపిల్ నుంచి 5G నెట్‌వర్క్‌ ( 5G iphones from Apple ) సౌకర్యం కలిగిన ఐఫోన్స్ మార్కెట్‌లోకొచ్చేశాయ్. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న యాపిల్‌ కార్యాలయం యాపిల్ పార్క్‌లో మంగళవారం జరిగిన వర్చువల్‌ కార్యక్రమంలో యాపిల్ సంస్థ ఐఫోన్‌ 12 సిరీస్‌ కింద నాలుగు మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్‌ 12 సిరీస్‌లో ఐఫోన్ 12 మినీ ( iphone Mini ), ఐఫోన్‌ 12 ( iphone 12 ), ఐఫోన్‌ 12 ప్రో ( iphone Pro ), ఐఫోన్‌ 12 ప్రో మ్యాక్స్‌ ( iphone Pro max ) పేరుతో 4 మోడల్స్‌ను యాపిల్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. అమెరికాలో లాంచ్ చేసిన అన్ని ఐఫోన్ 12 సిరీస్ మోడల్స్ కూడా అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్ పరిజ్ఞానం ఉన్న మిల్లిమీటర్ వేవ్ 5Gని సపోర్ట్ చేస్తాయని యాపిల్ ప్రకటించింది. అదే సమయంలో లోవర్ ఫ్రీక్వెన్సీ బాండ్ ఉన్న నెట్‌వర్క్ టెక్నాలజీకి సైతం సపోర్ట్ చేస్తాయని యాపిల్ ( Apple ) వెల్లడించింది. కొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్ మొబైల్స్ 5జీ నెట్‌వర్క్‌లో స్పీడ్ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేయవని.. కానీ తమ ఐఫోన్ 12 మోడల్స్ అలా కావని యాపిల్ స్పష్టంచేసింది. Also read : Apple Diwali offers: యాపిల్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఫోన్‌ 12 ప్రారంభ ధర 799 డాలర్లు కాగా దీని స్క్రీన్ సైజ్ 6.1 అంగుళాలుగా ఉంది. అలాగే ఐఫోన్‌ 12 మినీ ప్రారంభ ధర 699 డాలర్లుగా కాగా దీని స్క్రీన్ సైజ్ 5.7 అంగుళాలుగా ఉంది. ఇక భారత మార్కెట్‌లో ఐఫోన్‌ 12 రూ.79,900, ఐఫోన్‌ 12 మినీ రూ.69,900 నుంచి లభించనున్నాయి. 


పొరపాటున ఫోన్ కిందపడినా పలగకుండా ఉండేందుకు వీలుగా సిరామిక్‌ షీల్డ్‌ గ్లాస్ కవర్ ( ceramic shield glass cover ) డిజైన్ కలిగి ఉంటుంది. సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ స్క్రీన్, మ్యాగ్‌సేఫ్‌ వైర్‌లెస్‌ చార్జింగ్‌ టెక్నాలజీ,  12 MP డ్యూయల్‌ రియర్‌ కెమెరా, ఫేస్‌ ఐడీ, గరిష్ఠంగా 2జీబీపీఎస్‌ స్పీడ్ డేటా యాక్సెస్‌ వంటి ఎన్నో ఫీచర్లు ఈ రెండు మోడల్స్ సొంతం. Also read : SAMSUNG GALAXY F41 price, features: 17 వేలకే 64 MP కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్


ఇక ఐఫోన్‌ 12 ప్రో ప్రారంభ ధర 999 డాలర్లు కాగా భారత్‌లో రూ.1,19,900 గా ఉంది. దీని స్క్రీన్ సైజ్ 6.5 అంగుళాలు. ఐఫోన్‌ 12 ప్రో మ్యాక్స్‌ ధర 1099 డాలర్లు కాగా భారత్‌లో రూ.1,29,900 గా నిర్ణయించారు. దీని స్క్రీన్ సైజ్ 6.7 అంగుళాలు. భారత మార్కెట్‌లోకి ఐఫోన్‌ 12, ఐఫోన్ 12 ప్రో మోడల్స్ అక్టోబరు 30 నుంచి అందుబాటులోకి రానుండగా.. ఐఫోన్‌ 12 మినీ, 12 ప్రో మ్యాక్స్‌ మాత్రం నవంబర్‌లో షిప్పింగ్ ప్రారంభం కానున్నాయి. Also read : Jobs, Salary increments: వాళ్ల ఉద్యోగాలకు ఢోకా లేదట.. జీతాలు కూడా పెరుగుతాయి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe