Apple iPhone15: ఆపిల్ కంపెనీకు చెందిన ఐఫోన్ అంటే అందరికీ క్రేజ్ ఎక్కువ. ధర ఎక్కువ కావడంతో చాలామంది వెనుకంజ వేస్తుంటారు. ప్రతియేటా సెప్టెంబర్ నెల వచ్చిందంటే ఐఫోన్ కొత్త సిరీస్ విడుదలవుతుంటుంది. ఇటీవలే ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయింది. ప్రస్తుతం విక్రయాలు కూడా ప్రారంభమై ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఫోన్ 15 ప్రత్యేకతలు


ఇది ఏ16 బయోనిక్ చిప్‌సెట్‌తో అదనపు సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. డ్యూయల్ కనెక్టివిటీ ఆప్షన్స్‌తో పాటు వైర్, వైర్‌లెస్ సౌకర్యముంటుంది. ఫోన్ మాట్లాడేటప్పుడు క్రిస్టల్ క్లియర్ కాన్వర్జేషన్ కోసం అడ్వాన్స్డ్ నాయిస్ కాన్సిల్లేషన్ వెసులుబాటు ఉంటుంది. ఎస్ఓఎస్, శాటిలైట్ కాలింగ్ ఫీచర్లు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో రోడ్ సైట్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటుంది. అంటే అత్యవసర పరిస్థితుల్లో శాటిలైట్ కనెక్టివిటీతో మెస్సేజ్‌లు పంపించుకోవచ్చు. రెండేళ్లపాటు ఉచిత శాటిలైట్ కనెక్టివిటీ సర్వీసెస్ ఉంటాయి.


ఐఫోన్ 15 బేసిక్ వేరియంట్ 79,900 రూపాయలకు అందుబాటులో ఉంటే ఐఫోన్ 15 ప్రో 134,900 రూపాయలుగా ఉంది. ధర ఎక్కువైనా సరే ఆపిల్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్, డిమాండ్ దృష్ట్యా నెలకు పైగా యూజర్లకు నిరీక్షణ నెలకొంది. 


ముంబై, డిల్లీల్లో ఆపిల్ అధికారిక స్టోర్స్‌లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి కార్డు యూజర్లు 6 వేల వరకూ డిస్కౌంట్ పొందే అవకాశముంది. మొత్తం డిస్కౌంట్ లభిస్తే ఐఫోన్ 15 ధర మరింతగా తగ్గిపోనుంది. మీ పాత ఐఫోన్ ఎక్స్చేంజ్‌పై ఇవ్వడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. ఇక అమెజాన్ ఇండియాలో కూడా ఐఫోన్ 15 విక్రయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైమ్ సభ్యులైతే కేవలం 24 గంటల్లోనే డెలివరీ పొందవచ్చు. అయితే అమెజాన్‌లో ఐఫోన్ 15 ఎక్కువగా అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తోంది. 


ఇక ఫ్లిప్‌‌కార్ట్, బ్లింకిట్ వంటి ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా యూనికార్న్, ఇమేజిన్, ఇండియా ఐస్టోర్, విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్, టాటా క్రోమ్ వంటి స్టోర్లలో లభ్యమౌతోంది. స్టోర్‌ను బట్టి ఆఫర్లు మారుతుంటాయని గుర్తుంచుకోవాలి. 


Also read: Diwali Discount Offer: దీపావళికి ముందే ఈ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్, ఏకంగా 2 లక్షల తగ్గింపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook