Central Govt Scheme For Students: విద్యార్థులకు రూ.4 లక్షల సాయం అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా అప్లయ్ చేసుకోవాలో తెలుసుకోండి
Government Schemes for Students : విద్యార్థులకు గుడ్ న్యూస్. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒకేషనల్ విద్య అభ్యసించే విద్యార్థులను ఉద్దేశించి ఒక ప్రత్యేక రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీం కింద విద్యార్థులకు నాలుగు లక్షల మేర లోన్ లభిస్తుంది ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Best Government Schemes for Students : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా విద్యార్థులు అదేవిధంగా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రత్యేకమైన పథకం ఒకటి అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం పేరు ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లోన్ స్కీమ్. ఈ పథకం కింద నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం తో విద్యార్థినీ, విద్యార్థులు తమ స్కిల్స్ డెవలప్ చేసుకొని ఉద్యోగాలకు అర్హత సాధించవచ్చు.
ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒకేషనల్ విద్య చదువుతున్న వారికి లోన్ అందిస్తుంది. ఇందులో ట్రైనింగ్ కోర్స్ ఫీజు వంటివి కవర్ అవుతాయి. ముఖ్యంగా ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, లైబ్రరీ ఫీజు, ల్యాబ్ ఫీజు, బుక్స్ కొనుక్కోవడానికి, ఇన్స్ట్రుమెంటేషన్, బోర్డింగ్, లాడ్జింగ్ ఇలా అన్ని వసతులకు ఈ డబ్బును వినియోగించుకోవచ్చు. ప్రతి విద్యార్థికి ఈ స్కీం కింద నాలుగు లక్షల రూపాయల వరకు లోన్ లభిస్తుంది. ఈ స్కీం కింద కోర్సులు రెండు సంవత్సరాల వరకు ఉంటాయి. అయితే నాలుగు లక్షల వరకు మాత్రమే మీకు ఆర్థిక సహాయం లభిస్తుంది. అంతకుమించి కోర్సు ఫీజు ఉన్నట్లయితే అది విద్యార్థి భరించాల్సి ఉంటుంది.
ఈ స్కీంను నేషనల్ సఫారీ కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లోన్లను అందిస్తున్నారు. దీనిపై ఐదు శాతం వడ్డీని ఫిక్స్ చేశారు. అయితే మహిళా విద్యార్థులకు 0.5% వడ్డీ పై తగ్గింపు లభిస్తుంది. ఈ రుణాన్ని ఏడు సంవత్సరాల కాలవ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Also Read :Car Expenditure: కొత్త కారు కొంటున్నారా? ఒక నిమిషం ఆగి ఇవి తెలుసుకోండి..లేదంటే భారీగా నష్టపోతారు
ఇక ఈ రుణం పొందడానికి కావలసిన కనీస అర్హతల గురించి తెలుసుకుందాం. మీరు ఎంపిక చేసుకున్న కోర్సు ప్రభుత్వం మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ లేదా కార్పొరేషన్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చెందిన మిషన్ సొసైటీ సంస్థల నుంచి పొందాల్సి ఉంటుంది. ఈ కాలవ్యవధి ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు ఉండాలి. ఈ కోర్సు అప్లై చేసే విద్యార్థికి వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. ఇక లోన్ పొందడానికి ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ బ్యాంకు అకౌంట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ వంటివి అవసరమవుతాయి. ఆన్లైన్ ద్వారా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక ఈ స్కీము ఉద్దేశం విషయానికొస్తే అట్టడుగు వర్గాలకు చెందిన వారి కోసం నిర్దేశించిన ఈ స్కీం ద్వారా వారు ఉద్యోగాలు పొందే అవకాశం లభిస్తుంది. తద్వారా అధికంగా అట్టడుగు స్థాయికి చెందినవారు పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ స్కీం కోసం మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://nskfdc.nic.in/en/content/home/home విజిట్ చేయాలి.
Also Read : FD Rates: ఇది కదా కావాల్సింది.. సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంకులో అన్ని బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.