FD Rates: ఇది కదా కావాల్సింది.. సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంకులో అన్ని బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటు

Senior Citizen FD Interest Rates 2024 : సీనియర్ సిటిజన్లకు ఈనెలలో బ్యాంకులు శుభవార్త చెప్పాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించాయి. ఈక్రమంలో సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా  8.10శాతం మేర వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి. మరి ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేటు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /5

FD Interest Rates: బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసేవారికి గుడ్ న్యూస్ చెప్పాయి బ్యాంకులు. మూడు కోట్లలోపుఉండే రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను కొన్ని బ్యాంకులు ఈ సెప్లెంబర్ నెలలో సవరిస్తున్నట్లు తెలిపాయి. ఆ జాబితాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటి  యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కర్నాటక బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్యాంకులు వడ్డీ రేట్లను మార్చిన తర్వాత జనరల్ వినియోగదారలుతో పాటు సీనియర్ సిటిజన్లకు ఏ టెన్యూర్ పై ఎంత వడ్డీ రేట్లు కల్పిస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.   

2 /5

ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మార్చుతున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లను నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో జనరల్ కస్టమర్లకు   7 రోజుల నుంచి 10 ఏళ్లటెన్యూర్ డిపాజిట్లపై 4.25శాతం నుంచి 7.30శాతం వడ్డీ కల్పిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే 4.75శాతం నుంచి 7.80శాతం వరకు వడ్డీ అందిస్తోంది. 

3 /5

ఈ బ్యాంకులో రూ. 3కోట్లలోపు ఉండే రిటైల్ డిపాజిట్లపై కొత్త వడ్డీరేట్లను సెప్టెంబర్ 1, 2024 నుంచే అమలు అవుతున్నాయి. ఇప్పుడు 7 రోజుల నుంచి 10 ఏండ్ల టెన్యూర్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.25శాతం వడ్డీ అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు 3-7.75శాతం వడ్దీని అందిస్తుంది. అదే సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే 3-7.90శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది.   

4 /5

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ ధన్ వృద్ధి పేరుతో 333 రోజుల స్పెషల్ టెన్యూర్ డిపాజిట్ స్కీమ్ ను అందిస్తుంది. ఈ కొత్త స్కీమ్ ద్వారా జనరల్ కస్టమర్లకు గరిష్టంగా 7.25శాతం వడ్డీ ఇస్తున్నారు. ఈ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 7.75శాతం అందిస్తుండగా..సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.90శాతం వడ్డీరేటును అందిస్తోంది. 

5 /5

ఈ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 3,2024  నుంచే అమల్లోకి వచ్చాయి. వడ్డీ రేట్లను సవరించిన తర్వాత జనరల్ కస్టమర్లకు 3.50శాతం నుంచి7.50శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లకు 3.75శాతం నుంచి 8శాతం వరకు వడ్డీ అందిస్తోంది. 375 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై గరిష్టంగా 7.50శాతం, 8శాతం మేర వడ్డీరేట్లు కల్పిస్తోంది.