Bajaj Chetak eScooter: బజాజ్ చేతక్ గుర్తుందా. దేశమంతా ప్రాచుర్యం పొందిన అప్పటి ఫ్యాషన్ స్కూటర్. ఇప్పుడు అదే బజాజ్ చేతక్ సరికొత్త రూపంలో..ఇస్కూటర్ లాంచ్ అయింది. మొన్న కోల్‌కతా..నేడు మహారాష్ట్రలో లాంచ్ అయిన బజాజ్ చేతక్ ఇస్కూటర్ విశేషాలివీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2000 సంవత్సరం వరకూ వరకూ బజాజ్ చేతక్ స్కూటర్లదే రాజ్యం. ఫ్యామిలీలు ఎక్కువగా ఇష్టపడే మోస్ట పాపులర్ టూ వీలర్ అప్పట్లో. ఇప్పుడు మళ్లీ బజాజ్ సంస్థ అదే పేరుతో సరికొత్త రూపంలో దింపుతోంది. బజాజ్ చేతక్ ఇస్కూటర్ ఇప్పటికే దశలవారీగా మార్కెట్‌లో ప్రవేశిస్తోంది. కొన్ని వారాల క్రితం కోల్‌కతాలో బ్యాటరీ పవర్డ్ బజాజ్ చేతక్ ఇస్కూటర్ మార్కెట్‌లో ప్రవేశించింది. ఇప్పుడు మహారాష్ట్ర సోలాపూర్‌లో ప్రవేశించింది. దీని ఎక్స్ షోరూం ధర 1 లక్ష 34 814 రూపాయలుంది. సింగిల్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. కలర్స్ విషయంలో మాత్రం బ్రూక్లిన్ బ్లాక్, హాజెల్ నట్, ఇండిగో మెటాలిక్, వెల్లుటో రోస్సో రంగుల్లో బజాజ్ చేతక్ ఇస్కూటర్ లభిస్తోంది. కేవంల 2వేలరూపాయలు అడ్వాన్స్ చెల్లించి బజాజ్ చేతక్ ఇస్కూటర్ బుక్ చేసుకోవచ్చు. ఈ బండికి ప్రత్యర్ధులుగా టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1 ఉన్నాయి.


బజాజ్ చేతక్ ఇస్కూటర్ ఫీచర్లు


ఇందులో 3.8 కిలోవాట్స్ ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు..నాన్ రిమూవబుల్ 3కిలోవాట్స్ పెర్ హవర్ లిధియం ఐయాన్ బ్యాటరీ ఉంది. ఒకసారి ఫుల్ రీఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల వేగంతో 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడిస్తోంది. త్వరలో మరింత ఎక్కువ దూరం ప్రయాణించేలా లాంగ్ రేంజ్ స్కూటర్లను టెస్ట్ చేయనుంది. మహారాష్ట్రలో ఇప్పటికే బజాజ్ చేతక్ ఇస్కూటర్ అమ్మకాలు 5 వేలు దాటినట్టు బజాజ్ ఆటో ప్రకటించింది. సోలాపూర్ కాకుండా..మహారాష్ట్రలో ఔరంగాబాద్, ముంబై, నాగపూర్, నాసిక్, పూణేల్లో బజాజ్ చేతక్ అందుబాటులో ఉంది. 


ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారంలో బజాజ్ ఆటో 3 వందల కోట్లు కొత్తగా పెట్టుబడి పెడుతోంది. రానున్న ఐదేళ్లలో ఈ వాహనాల వ్యాపారాన్ని వృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. పేరు పాతదే కావడంతో..జనంలో త్వరగా వెళ్లే అవకాశాలున్నాయి.


Also read: Credit Card New Rules: జూన్ 1 రేపట్నించి క్రెడిట్ కార్డు కొత్త నిబంధనలు అమలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook