Bajaj Chetak 2025 Modal: బజాజ్ నుంచి గుడ్ న్యూస్.. CNGలో Chetak స్కూటర్ లాంచ్.. విడుదల తేది వివరాలు!
Bajaj Chetak 2025 Modal: ప్రముఖ ఆటో బజాజ్ కంపెనీ మార్కెట్‌లో త్వరలోనే చేతక్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ కాబోతోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Bajaj Chetak 2025 Modal: ప్రముఖ దేశీయ ఆటో కంపెనీ బజాజ్ ప్రస్తుతం మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. గ్రీన్ ఎనర్జీ వాహనాలపై పని చేస్తూ అద్భుతమైన బైక్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ బజాజ్ కంపెనీ ఇటీవలే లాంచ్ చేసిన CNG బైక్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని బజాజ్ మార్కెట్‌లోకి FY25 నాటికి మరో కొత్త CNG మోటర్ సైకిల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు యోచిస్తోంది. దీనిని ఇథనాల్ వేరియంట్‌లో చేతక్ మోడల్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే బజాజ్ ఆటో సీఈఓ రాజీవ్ బజాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లారు. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ కొత్త సీఎన్‌జీ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుం మార్కెట్‌లో బజాజ్ కంపెనీ మంచి బజ్ క్రియోట్ చేసింది. దీంతో ఈ కంపెనీ ఇప్పుడు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సీఈవో తెలిపిన వివరాల ప్రకారం, కంపెనీ త్వరలోనే వచ్చే నెలలో ఇథనాల్‌తో నడిచే బైక్‌లతో పాటు ఆటోలను ప్రదర్శించబోతున్నట్లు తెలిపారు. వీటిని వచ్చే సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇథనాల్‌తో నడిచే చేతక్ అద్భుతమైన ఫీచర్స్‌తో 2025 సంవత్సరం ప్రారంభంలో కస్టమర్స్‌కి అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఆటోలను కూడా కొత్త మోడల్స్‌లో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం..
బజాజ్ కంపెనీ 2025 ఏడాది నాటికి నెలకు 100,000 గ్రీన్ ఎనర్జీ బైక్‌లతో ఆటోలను విక్రయించాలని గొప్ప లక్ష్యంతో ఈ సీఎన్‌జీ వాహనాలను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇప్పటికే కంపెనీ వాహనాల విక్రయాలు కూడా పెరిగినట్లు బజాజ్ సీఈవో తెలిపారు. అంతేకాకుండా వచ్చే సీజన్‌లో 100,000 క్లీన్ ఎనర్జీ వాహనాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఇప్పటికే బజాజ్ ఫ్రీడమ్ 125 2 కిలోల సిఎన్‌జి సిలిండర్ వేరియంట్‌లో విడుదల చేసిందని త్వరలోనే మరిన్ని బైక్‌లను లాంచ్ చేస్తామని సీఈవో వెల్లడించారు.
సీఈవో రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. ఆగస్టులో నెలలో ఫ్రీడమ్ 125 CNG బైక్‌లను కంపెనీ 8,000 నుంచి 9,000 విక్రయించారని తెలిపారు. అలాగే వచ్చే జనవరి వరకు వీటిని 40,000 వరకు డెలివరీ చేయాలని కంపెనీ భావిస్తోందని అన్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాదిలో ఈ రిక్షాను కూడా అందుబాటలోకి తీసుకు రాబోతున్నట్లు వెల్లడించారు. మార్కెట్‌లోకి బజాజ్ చేతక్ లాంచ్ అయితే కంపెనీ క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు ఇది TVS మోటార్స్ iQubeతో పోటీ పడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌లో టాక్ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.