Bajaj CNG Bike: బజాజ్ ఆటో లాంచ్ చేయనున్న సీఎన్‌జి బైక్ ఈ ఏడాదిలోనే అత్యంత విభిన్నమైంది కావచ్చు. వచ్చే నెల అంటే జూన్ 18 నుంచి అందుబాటులో రావచ్చని తెలుస్తోంది. ఇప్పుడున్న ఇంధన ఖర్చుల్ని దాదాపు సగం తగ్గించేస్తుంది ఈ కొత్త CNG బైక్.  Bajaj Pulsar NS400Z లాంచ్ సందర్భంగా అప్‌కమింగ్ సీఎన్‌జి బైక్ వివరాలను కంపెనీ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజురోజుకూ ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఛార్జింగ్ బ్యాటరీ బైక్స్‌కు గ్యారంటీ లేదనే వాదన ఉంది. దీనికితోడు తరచూ ఛార్జింగ్ పెట్టుకునే శ్రమ ఉంటుంది. ఈ నేపధ్యంలో బజాజ్ లాంచ్ చేయనున్న కొత్త CNG బైక్ మంచి ప్రత్యామ్నాయం కాగలదని తెలుస్తోంది. ఈ బైక్ ఎలా ఉంటుందనే విషయంపై ఇంకా చాలా సందేహాలు నెలకొన్నాయి. Bajaj CNG Bike స్లోపర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 125 సిసి వరకూ కెపాసిటీ ఉంటుంది. ఈ బైక్‌లో హెవీ డ్యూటీ ట్యూబ్యులర్ స్టీల్ క్రెడిల్ ఫ్రేమ్ ఛాసిస్ ఇచ్చారని తెలుస్తోంది. సీట్ కింద సీఎన్‌జి సిలెండర్ అమర్చినట్టు కంపెనీ విడుదల చేసిన లే అవుట్ ద్వారా తెలుస్తోంది. 


పొడవైన సీటు అమరిక, టెయిల్ ప్యానెల్ ఆకర్షణీయంగా కన్పిస్తున్నాయి. బ్రేస్డ్ హ్యాండిల్ బ్యార్, గతుకుల రోడ్లపై కూడా సునాయసంగా పరుగులు తీసేలా బైక్ డిజైన్ ఉంటుంది. టెలీస్కోపిక్ ఫోర్క్ ముందువైపుంటే..బ్యాక్ సైడ్ మోనోషాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. సీట్ కింద అమర్చే సిలెండర్ కాకుండా ముందు భాగంలో ఎప్పుడూ ఉండేలా పెట్రోల్ ట్యాంక్ అలానే ఉంటుంది. కానీ కొద్దిగా పరిమాణం తగ్గుతుంది. సీఎన్జీ గ్యాస్ ఫిల్ చేయాలంటే స్కూటీ వంటి మోపెడ్స్‌కు ఉన్నట్టు సీట్ పైకి తీయాల్సి ఉంటుంది.


Bajaj CNG Bike పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ, సీఎన్‌జీ గ్యాస్ సిలెండర్ కెపాసిటీ వివరాలు, మైలేజ్ ఎంత ఇస్తుందనే వివరాలు ఇంకా వెల్లడి కావల్సి ఉంది. ఇక ధర కూడా తక్కువే ఉండవచ్చని అంచనా. ఈ బైక్ ధర 80 వేలతో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. జూన్ 18న మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఇది దేశంలో మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ కానుంది. దాంతో మార్కెట్‌లో పోటీ ఉండదు. కానీ ఇతర హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ రేడియాన్, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 110 బైక్స్‌తో పోటీ పడనుంది.


Also read: Bajaj Pulsar NS400Z: గంటకు 154 కిలోమీటర్ల వేగంతో కొత్త పల్సార్ బైక్, ధర ఫీచర్లు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook