2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 బైక్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇందులో అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ బైకికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Bajaj Pulsar N250: మార్కెట్‌లో బజాజ్ బైక్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ తమ పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది. బజాజ్ గతంలో మార్కెట్‌లోకి లాంచ్ చేసిన పల్సర్ మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో దూసుకుపోతున్నాయి. దీంతో అప్‌డేట్ వేరియంట్స్‌లో పల్సర్‌ను అనేక మోడల్స్‌లో ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తూ వస్తోంది. బజాజ్ కంపెనీ మార్కెట్‌లో పల్సర్ N250 బైక్‌కి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అనేక మార్పులతో కొత్త కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పల్సర్ N250 బైక్ 2024 అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి లాంచ్ అయ్యింది. అయితే దీనికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బజాజ్ పల్సర్ N250 డిజైన్:
బజాజ్ పల్సర్ N250 రెండు కలర్స్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ గ్లోసీ రేసింగ్ రెడ్‌తో పాటు పెర్ల్ మెటాలిక్ వైట్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ బజాజ్ పల్సర్ N250 బైక్‌లో కొత్త గ్రాఫిక్స్‌ను కూడా కలిగి ఉంటాయి. దీంతో పాటు ఇది మొత్తం మూడు వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ బజాజ్ పల్సర్ N250 బైక్ కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా కొత్త బంఫర్‌ను కూడా కలిగి ఉంటుంది.
బజాజ్ పల్సర్ N250 ఫీచర్స్:
గతంలో లాంచ్ చేసిన పల్సర్‌తో పోల్చి చూస్తే.. ఈ 2024 మోడల్ అనేక రకాల ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది కొత్త క్లస్టర్ గేర్ పొజిషన్ ఇండికేటర్‌తో పాటు మొబైల్ నోటిఫికేషన్ అలర్ట్ వంటి ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఫ్యూయల్ ట్యాంక్ ఎకానమీ, ఫ్యూయల్ ఇండికేషన్ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ కొత్త బైక్‌లో ఓడోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్ వంటి ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ ఫీచర్లు:
ఈ బజాజ్ పల్సర్ N250 కనెక్టివిటీ ఫీచర్ల వివరాల్లోకి వెళితే.. ఇందులో స్విచ్‌గేర్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు బైక్ నడుపుతున్న సమయంలో కాల్ నోటిఫికేషన్‌ను పొందే ఛాన్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇది బజాజ్ రైడ్ కనెక్ట్ అప్లికేషన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా క్లస్టర్ బ్లూటూత్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంటుంది. ఇవేకాకుండా అనేక కనెక్టివిటీ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
ఇతర ఫీచర్స్:
డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
మూడు ABS మోడ్‌లు
ట్రాక్షన్ కంట్రోల్
హార్డ్‌వేర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి