Bajaj Pulsar Ns400 2024: ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ బజాజ్ త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. బజాజ్ తమ సక్సెస్‌ సిరీస్‌ పల్సర్ నుంచి త్వరలోనే కొత్త మొబైల్‌ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అతి శక్తివంతమైన ఇంజన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు గతంలో లాంచ్‌ చేసిన NS సిరీర్‌ మొబైల్స్‌కి మార్కెట్‌లో ప్రత్యేకమైన డిమాండ్‌ ఉండడంతో కొత్త త్వరలోనే పల్సర్ NS400 ఆప్డేట్‌ వేరియంట్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ బైక్‌ను కంపెనీ ఇంజన్ డొమినార్ 400 లాంటి డిజైన్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ NS400 బైక్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీజర్‌ విడుదల:
బజాజ్‌ కంపెనీ ఈ బైక్‌కి సంబంధించిన టీజర్‌ కూడా ఇటీవలే విడుదల చేసింది. టీజర్‌లో షేర్‌ చేసిన వివరాల ప్రకారం.. ఈ బైక్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌పై 'NS' అనే పొడవాటి స్టిక్కరింగ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు కంపెనీ దీనిని మొత్తం రెండు కలర్‌ ఆప్షన్స్‌లో లాంచ్ చేయబోతోంది. ఇక ఈ బైక్‌ బ్యాక్‌ సైడ్‌లో భాగంగా '400' బ్యాడ్జింగ్ కూడా వస్తుంది. ఇక ఈ బైక్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, మోటార్‌సైకిల్ USD ఫోర్క్స్, డ్యూయల్-ఛానల్ ABS, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అందుబాటులోకి రాబోతోంది.


ప్రత్యేకమైన మోడ్‌లు:
బజాజ్‌ పల్సర్ NS400ను కంపెనీ రెయిన్, రోడ్ వంటి ABS మోడ్‌లలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీంతో పాటు USD ఫోర్క్‌ సెటప్‌తో రాబోతోంది. పల్సర్ NS400 ట్రాక్షన్ కంట్రోల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా అందుబాటులో ఉంది. దీని కోసం ప్రత్యేకమైన బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ కూడా లభిస్తోంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్‌ ఫీచర్స్‌ కూడా లభిస్తోంది. ఇది 373cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ ఇంజన్‌  గరిష్టంగా 40 బిహెచ్‌పి పవర్, 35 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇతర ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6-స్పీడ్ గేర్‌బాక్స్
స్మూత్ డౌన్‌షిఫ్టింగ్ కోసం అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్
ట్రెల్లీస్ ఫ్రేమ్
41mm USD ఫ్రంట్ ఫోర్క్
మోనోషాక్ రియర్ సస్పెన్షన్
డ్యూయల్-ఛానెల్ ABS
LED హెడ్‌ల్యాంప్
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
బ్లూటూత్ కనెక్టివిటీ


అదనపు ఫీచర్స్:
ఎర్గోనామిక్ రైడింగ్ పొజిషన్
స్టైలిష్ డిజైన్
డ్యూరబుల్ నిర్మాణం
మంచి ఇంధన సామర్థ్యం


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి