PIB Fact Check: రెండు బ్యాంకు ఖాతాలుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుందా, ఎంత చెల్లించాలి
PIB Fact Check: బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఓ వార్త గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఎక్కౌంట్లు కలిగి ఉంటే జరిమానా విధిస్తారనేది ఆ వార్త. ఇదే ఇప్పుడు చాలామందిని ఆందోళనకు గురి చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PIB Fact Check: సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫేక్ ఉంటే కొన్ని నిజాలుంటాయి. ఇప్పుుడు కొత్తగా బ్యాంకు ఎక్కొంట్లకు సంబంధించిన వార్త ఒకటి బాగా స్ప్రెడ్ అవుతోంది. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందనేది ఆ వార్త సారాంశం. ఇందులో నిజానిజాలేంటో పరిశీలిద్దాం.
బ్యాంక్ ఎక్కౌంట్ కలిగి ఉండటం అనేది చాలా కామన్. దాదాపు ప్రతి ఒక్కరికీ ఉంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పధకాలు అందుకోవాలన్నా బ్యాంక్ ఎక్కౌంట్ తప్పనిసరి. చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఎక్కౌంట్లు ఉంటుంటాయి. ఈ నేపధ్యంలో కొద్దిరోజుల్నించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఓ వార్త బ్యాంకు ఎక్కౌంట్ హోల్డర్లు ఆందోళన కల్గిస్తోందగి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా మార్గదర్శకాల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఎక్కౌంట్లు ఉంటే జరిమానా చెల్లించాల్సి వస్తుందనే వార్త వైరల్ అవుతోంది. ఇదే ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వైరల్ అవుతున్న ఈ వార్త నిజమెంతో వెల్లడించింది. ఈ మేరకు పీఐబీ ట్వీట్ కూడా చేసింది. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఎక్కౌంట్లు కలిగి ఉంటే జరిమానా చెల్లించాలనే వార్త ప్రచారంలో ఉందని, కానీ ఇదింతా పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి మార్గదర్శకాలేవీ జారీ చేయలేదని తెలిపింది.
ఈ తరహా వార్తలేవైనా ప్రచారంలో ఉంటే మీరు కూడా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సహాయంతో నిజానిజాలు నిర్ధారణ చేసుకోవచ్చు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వాట్సప్ నెంబర్ 8799711259 లేదా factcheck@pib.gov.in కు సంప్రదించవచ్చు. ఏది నిజమో ఏది కాదో తెలుసుకోవచ్చు.
Also read: Platform Ticket Rules: ప్లాట్‌ఫామ్ టిక్కెట్‌తో రైలులో ప్రయాణం చేయవచ్చా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook