Bank Holidays in August: బ్యాంకులకు సంబంధించి ముఖ్యమైన పనులు ఉంటే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఆగస్టు నెలలో 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆన్‌లైన్ సేవలు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ (ఆన్‌లైన్ బదిలీ) సేవలు ఉన్నా.. చెక్‌బుక్, పాస్‌బుక్ వంటి పనులపై ప్రభావం పడనుంది. అదేవిధంగా రూ.2000 నోట్లను ఇంకా మార్చుకోలేని వారు ఉంటే.. త్వరగా మార్చుకుంటే బెటర్. ఆగస్టు నెలకు సంబంధించి సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. పండుగలు, జన్మదినోత్సవాలు, శని, ఆదివారాల కారణంగా వచ్చే నెలలో మొత్తం 14 రోజులపాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగస్టు నెలలో 4 ఆదివారాలు ఉన్నాయి. రెండో, నాల్గో శనివారాలు బ్యాంకులకు సెలవులు. అంటే ఈ 6 రోజులపాటు దేశం మొత్తం బ్యాంకులు సెలవులు ఉంటాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీ డే ఉంటుంది.  ఓనం, రక్షా బంధన్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆగస్టు నెలకు సంబంధించి పూర్తి సెలవుల జాబితా ఇలా.. 


==> ఆగస్టు 6- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు
==> ఆగస్ట్ 8- రమ్ ఫాట్ కారణంగా గ్యాంగ్‌టక్‌లోని టెండాంగ్ ల్హో హాలీ డే
==> ఆగష్టు 12- రెండో శనివారం కారణంగా సెలవు
==> ఆగస్టు 13- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
==> ఆగస్టు 15- స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా దేశవ్యాప్తంగా హా డే
==> ఆగస్టు 16- పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా ముంబై, నాగ్‌పూర్, బేలాపూర్‌లలో బ్యాంకులకు సెలవు
==> ఆగస్టు 18- శ్రీమంత శంకర్‌దేవ్ తిథి కారణంగా గౌహతిలో బ్యాంకులు బంద్ కానున్నాయి.
==> ఆగస్టు 20- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
==> ఆగస్టు 26– నాల్గో శనివారం హాలీ డే
==> ఆగస్టు 27- ఆదివారం 
==> ఆగస్టు 28, 29- మొదటి ఓనం, తిరుఓణం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవులు
==> ఆగస్టు 30- రక్షా బంధన్ కారణంగా బ్యాంకులకు హాలీ డే 
==> ఆగస్ట్ 31- రక్షా బంధన్/శ్రీ నారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్ కారణంగా డెహ్రాడూన్, గ్యాంగ్‌‌టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. 


ఆన్‌లైన్ సేవలు 


==> యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలపై బ్యాంకు సెలవుల ప్రభావం ఉండదు.
==> క్యాష్ విత్ డ్రా కోసం ఏటీఏంను ఉపయోగించవచ్చు. యూపీఐ ద్వారా కూడా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
==> నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, డిజిటల్ చెల్లింపుల ద్వారా కూడా బ్యాంకింగ్‌కు సంబంధించిన పనులు చేసుకోవచ్చు.
==> నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఒక అకౌంట్‌ నుంచి మరో అకౌంట్‌కు క్యాష్‌ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.


Also Read: Anakapalle Child Death: చిన్నారిని గరిటెతో కొట్టిన తల్లి.. 16 నెలల పసికందు మృతి  


Also Read: Credit Card Rules: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. పెరిగిన ఛార్జీలు ఇలా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి