Bank Holidays December 2022: వచ్చే నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే డిసెంబరులో బ్యాంకు సెలవుల జాబితాను ఓసారి చెక్ చేసుకోండి. డిసెంబర్ నెలలో 31 రోజులకు 13 రోజులు బ్యాంకులు పనిచేయవు. బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. బ్యాంకులకు కొన్ని సెలవులు దేశవ్యాప్తంగా కామన్ గా ఉంటాయి. మరికొన్ని సెలవులు ఆయా రాష్ట్రాల పండుగల ఆధారంగా ఉంటాయి. కాబట్టి సెలవులన్ని అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిసెంబర్ బ్యాంక్ సెలవుల జాబితా 2022: 
డిసెంబర్ 3 - సెయింట్ జేవియర్స్ ఫీస్ట్ - గోవాలో బ్యాంకులకు సెలవు.  
డిసెంబర్ 4 - ఆదివారం
డిసెంబర్ 10 - రెండవ శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి
డిసెంబర్ 11- ఆదివారం 
డిసెంబరు 12 - పా-టాగన్ నెంగ్మింజ సంగం - మేఘాలయలో బ్యాంకులు మూసివేత.
డిసెంబర్ 18- ఆదివారం 
డిసెంబర్ 19 - సోమవారం-గోవా విమోచన దినం - గోవాలో బ్యాంక్ మూసివేత
డిసెంబర్ 24 - క్రిస్మస్ మరియు నాల్గవ శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేత.
డిసెంబర్ 25 - ఆదివారం 
డిసెంబర్ 26 - సోమవారం- క్రిస్మస్, లాసంగ్, నమ్సంగ్ - మిజోరాం, సిక్కిం, మేఘాలయలో బ్యాంకులకు సెలవు. 
డిసెంబర్ 29 - గురు గోవింద్ సింగ్ జీ పుట్టినరోజు - చండీగఢ్‌లో బ్యాంక్ మూసివేత
డిసెంబర్ 30 - యు కియాంగ్ నంగ్వా - మేఘాలయలో బ్యాంక్ మూసివేత
డిసెంబర్ 31 - నూతన సంవత్సర వేడుకలు - మిజోరాంలో బ్యాంక్ సెలవు.


Also Read: Digital Pad Features: డిజిటల్ ప్యాడ్.. ధర తక్కువ, ఉపయోగం ఎక్కువ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook