Digital Pad Features: డిజిటల్ ప్యాడ్.. ధర తక్కువ, ఉపయోగం ఎక్కువ

Dead Cheap Writing Digital Pad : ఒక పేపర్‌పై పెన్నుతో రాస్తే ఎలాగైతే ఉంటుందో.. అచ్చం అదే తరహాలో ఉంటుంది. అలాగే ఒక సింగిల్ బటన్ నొక్కి మీరు రాసిన మొత్తాన్ని డిలీట్ చేసి మళ్లీ స్రీన్ పై ఫ్రెష్ గా రాసుకోవడానికి వీలు ఉంటుంది.

Written by - Pavan | Last Updated : Nov 24, 2022, 12:29 PM IST
  • పెరిగిపోతున్న స్టేషనరి ఖర్చులకు చెక్ పెట్టండి
  • రైటింగ్ వర్క్, డ్రాయింగ్ కోసం డిజిటల్ ప్యాడ్ ట్రై చేయండి
  • డిజిటల్ ప్యాడ్‌తో తక్కువ ధరకే ఎన్నో లాభాలు
Digital Pad Features: డిజిటల్ ప్యాడ్.. ధర తక్కువ, ఉపయోగం ఎక్కువ

Dead Cheap Writing Digital Pad : మీరు నిత్యం చేసే పనిలో భాగంగా రాత పని కూడా ఉంటుందా ? అయితే, మీరు రెగ్యులర్ గా డైరీ, పెన్ను మెయింటెన్ చేస్తున్నారన్న మాట. మరి డైరీలో పేజీలు నిండినా లేదా పెన్నులో ఇంక్ అయిపోయినా.. మీకు ఇబ్బందులు తప్పవు కదా. ఈ రెండింటిలో ఏది లేకున్నా మీ రాత పని ఆగిపోవాల్సిందే కదా. కానీ పెన్నూ, పేపర్ లాంటివి ఏవీ లేకుండానే మీ పని ఆగకుండా చేసుకుపోవాలంటే ఇదిగో ఈ డిజిటల్ ప్యాడ్ ను ట్రై చేయండి. ఆధునిక పోకడలకు అనుగుణంగా మీ అవసరాలకు సరైన పరిష్కారం అవుతుంది. స్టేషనరీ ఖర్చులు భారీగా పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో తక్కువ ధరకే ఎన్నో అవసరాలకు పనికొస్తుంది ఈ డిజిటల్ ప్యాడ్. 

ఈ డిజిటల్ ప్యాడ్ ఏంటి ? ఎందుకు అంత ప్రాధాన్యత ?
ఇప్పుడు మేము మీరు పరిచయం చేస్తోన్న ఈ ఎలక్ట్రానిక్ డివైజ్ పేరు thriftkart Writing pad Drawing Tablet Tab with Pen Electronic LCD Kids Tablet. ఇంకా చెప్పాలంటే ఇది ఒక ఎల్సీడీ రైటింగ్ ప్యాడ్ అన్నమాట. ఈ డిజిటల్ ప్యాడ్‌పై రాయడం ఎంత తేలికో.. చెరిపేయడం కూడా అంతే తేలిక.  మీ బ్యాగ్‌లో లేదా పుస్తకాల మధ్య ఎక్కువ స్పేస్ తీసుకోకుండా చిన్న సైజ్ నోట్ బుక్ తరహాలో తేలిగ్గా అమరుతుంది. 

ఇలాంటి పరికరాలు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి అన్ని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని అసలు ధర ₹ 499 వరకు ఉన్నప్పటికీ.. పైన చెప్పుకున్న ప్రోడక్ట్ మాత్రం 68 శాతం భారీ డిస్కౌంట్ ధరకే అందుబాటులో ఉంది. అంటే డిస్కౌంట్ తరువాత కేవలం 160 రూపాయలకే ఈ డిజిటల్ ప్యాడ్ ని మీ సొంతం చేసుకోవచ్చన్నమాట.

ఈ డిజిటల్ ప్యాడ్ ఎల్సీడీ స్క్రీన్‌పై టచ్ స్క్రీన్ టెక్నాలజీ తరహాలో పెన్నుతో రాయవచ్చు. అది కూడా చిన్న పిల్లలను ప్రోత్సహించే విధంగా, ఆకర్షించే విధంగ వివిధ రంగుల్లో రాసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఒక పేపర్‌పై పెన్నుతో రాస్తే ఎలాగైతే ఉంటుందో.. అచ్చం అదే తరహాలో ఉంటుంది. అలాగే ఒక సింగిల్ బటన్ నొక్కి మీరు రాసిన మొత్తాన్ని డిలీట్ చేసి మళ్లీ స్రీన్ పై ఫ్రెష్ గా రాసుకోవడానికి వీలు ఉంటుంది. కేవలం రాసుకోవడానికి మాత్రమే కాకుండా చిన్నపిల్లలు డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేయడానికి కూడా ఈ డిజిటల్ ప్యాడ్ మెరుగ్గా పనిచేస్తుంది. పైగా వివిధ రంగుల్లో పెన్నుని ఉపయోగించుకోవడానికి వీలు ఉండటంతో డ్రాయింగ్ మరింత అందంగానూ వస్తుంది.

Also Read : Flipkart Offers: వావ్.. రూ. 24 వేల Samsung Galaxy F23 5G స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 17 వేలకే.. లిమిటెడ్ అఫర్ 

Also Read : Buying TV, Cars, Fridges: ఇప్పుడు టీవీలు, కార్లు, ఫ్రిడ్జిలు కొంటున్నారా ?

Also Read : Huge Flipkart Discount: రూ. 45,999 గల realme GT Neo 3 కేవలం రూ. 25,499లకే.. డెడ్‌ ఛీప్‌ ఆఫర్స్‌ ప్రారంభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News