Bank Holidays: రేపటి నుంచి బ్యాంకులకు వరుస సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా
Bank Holidays: బ్యాంకులో ఏదైనా పని ఉందా? అయితే ఈ అప్డేట్ మీకోసమే. రేపటి నుంచి బ్యాంకులు వరుస సెలవులో ఉండనున్నాయి. సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Holidays: నేటి (ఏప్రిల్ 1)నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభమైంది. దీనితో నేడు దేసవ్యాప్తంగా బ్యాంకులన్నీ.. సెలవులో ఉండటం లేదా పాక్షికంగా కార్యకలాపాలు సాగించడం వంటివి చేశాయి. ఇక రేపు కూడా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి.
ఏ ఏ రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు..
సాధారణంగా ప్రతి నెల మొదటి శనివారం బ్యాంకులు పూర్తి స్థాయిలో పని చేస్తాయి. ఏదైనా ప్రత్యేకించి పండుగలు లేదా ప్రముఖుల పుట్టిన రోజుల వంటి సందర్భాలు ఉంటే సెలవు ప్రకటిస్తాయి. అయితే ఈ సెలవులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు.
అలానే ఈసారి ఉగాది (తెలుగు నూతన సంవత్సరం), గుడిపడ్వా సహా వివిధ కారణాలతో పలు రాష్ట్రాల్లో బ్యాంకులు రేపు (ఏప్రిల్ 2) సెలవులో ఉండనున్నాయి.
ఎక్కడెక్కడ బ్యాంకులకు సెలవు అంటే?
తెలంగాణ, ఆధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్, గోవాలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు రేపు సెలవులో ఉంటాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో సెలవుల జాబితాను నోటిఫై చేసింది.
సెలవులో ఉన్నా..
బ్యాంకులు సెలవులో ఉన్నా ఆన్లైన్ లావాదేవీలపై ఎలాంటి ప్రబావం ఉండదు. యూపీఐ, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి సేవలు 24x7 అందుబాటులో ఉంటాయి.
అయితే రుణాల చెల్లింపు, చెక్ క్లియరెన్స్ వంటి వాటికోసం కచ్చితంగా బ్యాంక్‌కు వెళ్లాల్సి వస్తే.. ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
ఏప్రిల్ 2తో పాటు.. 3న ఆదివారం కారణంగా బ్యాంకులు సాధారణంగానే సెలవులో ఉంటాయి. ఆ తర్వాత 4, 5 తేదీల్లోనూను రాష్ట్రాల వారీగా బ్యాంకులు సెలవులో ఉంటాయి.
Also read: Pan aadhaar link: పాన్-ఆధార్ లింక్ గడువు ముగిసింది- ఇకపై రూల్స్ ఇలా..
Also read: ATF Price hike: కొత్త రికార్డు స్థాయికి ఏటీఎఫ్ ధర- పెరగనున్న విమాన టికెట్ల ధరలు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook