ATF Price hike: దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు.. ఎల్పీజీ (వంట గ్యాస్), ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) రేట్లు కూడా రికార్డు స్థాయికి చేరుతున్నాయి.
తాజాగా ఏటీఎఫ్ ధర కిలో లీటర్‌కు 2 శాతం పెరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.2,258.54 ప్రియమైంది. దీనితో ఏటీఎఫ్ ధర జీవనకాల గరిష్ఠమైన (లీటర్) రూ.1,12,924.83 వద్దకు చేరింది.
దేశంలో ఏటీఎఫ్ ధరలు పెరగటం ఈ ఏడాది ఇది ఏడవసారి కావడం గమనార్హం. దేశంలో ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలను ప్రతి నెల 1న, 16న సవరించే విధానం అమలులో ఉంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 1) ఏటీఎఫ్ ధరలను అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా.. దేశీయంగా ఏటీఎఫ్ ధరలు పెరిగాయి. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర కూడా రూ.250 మేర పెరిగిన విషయం తెలిసిందే.
గత ఏడు దఫాల్లో ఎంత పెరిగిందంటే..
ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏటీఎఫ్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏడు సార్లు పెరగ్గా.. కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.38,902.92 ప్రియమైంది. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ఏటీఎఫ్ ధర 50 శాతం పెరిగిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక ఏటీఎఫ్ రేట్లు పెరిగిన నేపథ్యంలో.. విమానయనాన సంస్థల వ్యయాలు 40 శాతం మేర పెరగనున్నాయని అంచనాలు వస్తున్నాయి. దీనితో ఎయిర్‌లైన్ సంస్థలు టికెట్ల ధరలు పెంచొచ్చని తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా పెట్రోల్ మోత..
ఇక గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతూ పోతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు శుక్రవారం బ్రేక్ పడింది. 11 రోజుల్లో ఇంధన ధరలు రూ.6.40 వరకు పెరిగింది.
Also read: LPG Gas Price Hike: భారీగా పెరిగిన LPG గ్యాస్ ధర.. సిలిండర్ పై రూ.250 పెంపు!
Also read: Changes from April 1: రేపటి నుంచి కొత్త రూల్స్- పెరగనున్న వంట గ్యాస్ ధర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook