August Bank Holidays: ఖాతాదారులకు హెచ్చరిక.. ఆగస్టులో ఏకంగా 18 రోజులు బ్యాంకులకు సెలవులు
August Bank Holidays: ఆగస్టు మాసంలో బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను ఆర్బీఐ రిలీజ్ చేసింది. జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో బ్యాంకులకు ఎక్కువ సెలవులే వచ్చాయి.
Bank Holidays in August 2022: మరో నాలుగు రోజుల్లో జూలై నెల ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు మాసానికి సంబంధించిన బ్యాంకులకు గల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిలీజ్ చేసింది. దీని ప్రకారం అయితే మెుత్తం 9 రోజులుపాటు బ్యాంకులకు సెలవు. ఇందులో శని, ఆదివారాలు కలిపి 6 సెలవులు. మెుహరం, స్వాతంత్ర్య దినోత్సవం, జన్మాష్టమి మరో మూడు సెలవులు. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాల్లో పలు స్థానిక పండుగల సందర్భంగా మరో 9 రోజులుపాటు బ్యాంకులు పనిచేయవు. జూలై నెలతో పోలిస్తే.. ఆగస్టులోనే బ్యాంకులకు ఎక్కువగా సెలవులు వస్తున్నాయి.
ఆగస్టు 2022లో బ్యాంక్ సెలవుల జాబితా:
ఆగస్ట్ 1: దృపక షీ-జీ పండుగ (సిక్కిం మాత్రమే)
ఆగస్ట్ 8: మొహర్రం (జమ్మూ కాశ్మీర్ మాత్రమే)
ఆగస్టు 9: మొహరం (దేశంలోని పలు ప్రదేశాల్లో సెలవు)
ఆగస్టు 11: రక్షా బంధన్
ఆగస్టు 12: రక్షా బంధన్
ఆగస్టు 13: దేశభక్తుల దినోత్సవం (ఇంఫాల్)
ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16: పార్సీ నూతన సంవత్సరం (బేలాపూర్, ముంబై మరియు నాగ్‌పూర్)
ఆగస్టు 18: జన్మాష్టమి (భువనేశ్వర్, డెహ్రాడూన్, కాన్పూర్ మరియు లక్నో)
ఆగస్టు 19: జన్మాష్టమి
ఆగస్ట్ 20: శ్రీ కృష్ణ అష్టమి (హైదరాబాద్ మాత్రమే)
ఆగస్టు 29: శ్రీమంత్ శంకర్‌దేవ్ జయంతి గౌహతి మాత్రమే)
ఆగస్టు 31: గణేష్ చతుర్థి/వినాయక చతుర్థి (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్ మరియు పనాజీలో)
వచ్చే నెలలో శని, ఆదివారాలు:
ఆగస్టు 7: ఆదివారం
ఆగస్టు 13 : శనివారం
ఆగస్టు 14: ఆదివారం
ఆగస్టు 21: ఆదివారం
ఆగస్ట్ 27: నాల్గో శనివారం
ఆగస్టు 28: ఆదివారం
Also Read: Fact Check: ఇండియన్ ఆయిల్ నుంచి 6 వేల రూపాయల డిస్కౌంట్ కూపన్, వైరల్ అవుతున్న పోస్ట్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook