కరోనా సెకండ్ వేవ్ సమయంలో బ్యాంకు పనిమీద వెళ్లేవారు బ్యాంక్ సెలవులు, పనిదినాలు తెలుసుకోవాలి. లేదంటే బ్యాంక్ పనిమీద పదే పదే ఇంటి నుంచి బయటకు వెళ్లడం ద్వారా కరోనా బారిన పడే అవకాశాలు ఉంటాయి. కనుక భారతదేశ బ్యాంకులకు బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగుల సెలవు దినాలను(Bank Holidays May 2021) ఖరారు చేసింది. పూర్తి వివరాలకు మీరు ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) తెలిపిన దాని ప్రకారం మే నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవు దినాలు. అంటే బ్యాకు ఉద్యోగులు ఆ రోజులలో విధులకు హాజరు అవాల్సిన అవసరం ఉండదు. అయితే రాష్ట్రాలను బట్టి సెలవులు ఆధారపడి ఉంటాయి. ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు బ్యాంకులు సేవలు అందించవని తెలిసిందే. మే నెలలో తొలిరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా ఎస్‌బీఐ(State Bank Of India) సహా ఇతర బ్యాంకులకు సెలవుదినాలు ఆరోజు నుంచే ప్రారంభం కానున్నాయి. మే 7న జుమాత్ ఉల్ విదా, మే 13న రంజాన్ పండుగ రోజున బ్యాంకులకు సెలవు ఉంటుంది.


Also Read: QR Codesపై తన ఖాతాదారులకు SBI అలర్ట్, లేదంటే బ్యాంక్ ఖాతా ఖాళీ


మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..
- మే 1    మే డే/కార్మిక దినోత్సవం/మహారాష్ట్ర అవతరణ దినోత్సవం
- మే 2    ఆదివారం 
- మే 7    జుమాతుల్ విదా
- మే 8    రెండో శ‌నివారం
- మే 9    ఆదివారం
- మే 13    ఈదుల్ ఫిత‌ర్‌
- మే 14    పరుశురామ్ జయంతి/రంజాన్‌/ బసవ జయంతి
- మే 16    ఆదివారం
- మే 22    నాలుగో శ‌నివారం
- మే 23    ఆదివారం
- మే 26    బుద్ధపూర్ణిమ‌
- మే 30    ఆదివారం


Also Read: Twitter Features: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సరికొత్త ఫీచర్, ఇకనుంచి నగదు సంపాదించుకోండి


ఆయా రాష్ట్రాలను బట్టి బ్యాంకు సెలవులు ఆధారపడి ఉంటాయి. కొన్నిసార్లు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె, భారత్ బంద్ లాంటి కొన్ని ప్రత్యేక సందర్భాలు, కరోనా లాక్‌డౌన్ లాంటి సమయాల్లో బ్యాంకులు సేవలు అందించవు. బ్యాంకు ఉద్యోగులకు అవి సెలవు దినాలు. ఖాతాదారులు ప్రతి నెలా ముందుగానే బ్యాంక్ సెలవులు తెలుసుకుని పని మీద బ్యాంకులకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook