Bank of Baroda Hikes MCLR: రెపో రేటును స్థిరంగా ఉంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే.. బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (MCLR)ని పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని పదవీకాలాల్లో 5 బేసిస్ పాయింట్లు (bps) పెంచుతున్నట్లు తెలిపింది. కొత్త రేట్లు ఆగస్టు 12వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. బ్యాంక్ నిర్ణయంతో లోన్లు తీసుకున్న వారు ఈఎంఐలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇటీవలె హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఇటీవల తన ఎంసీఎల్‌ఆర్‌ను 15 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఈ రేట్లు ఆగస్టు 7వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంసీఎల్ఆర్‌ను పెంచడంతో పర్సనల్ లోన్లు, కారు లోన్లు, హోమ్ లోన్ తీసుకున్న వారిపై భారం పడనుంది. నెలవారీ ఈఎంఐలు మరింత ఎక్కువగా బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. తాజా పెంపుతో రాత్రికి రాత్రే ఎంసీఎల్ఆర్ 7.95 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.20 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.30 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.40 శాతానికి పెంచింది. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.65 శాతానికి పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. పెంచిన రేట్లు రేపటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. వడ్డీ రేట్లు ఇప్పటికే ఎంసీఎల్‌ఆర్ ఆధారపడి ఉన్న కస్టమర్లపై మాత్రమే ప్రభావం ఉండనుంది.  


ఎంసీఎల్ఆర్ అంటే..


కస్టమర్లకు బ్యాంకులు లోన్ ఇచ్చినప్పుడు వడ్డీ రేటును మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్‌లో వసూలు చేస్తాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఎంసీఎల్ఆర్‌ను పెంచితే.. బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్న ఖాతాదారులపై ప్రభావం చూపుతుంది. ఒక ఎంసీఎల్ఆర్ తగ్గిస్తే.. కట్టాల్సి ఈఎంఐ కూడా తగ్గుతుంది. అన్ని బ్యాంకులు సాధారణంగా రెపో రేటు ఆధారంగా ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతాయి. రెపో రేటు పెరుగుదల బ్యాంకుల ఎంసీఎల్ఆర్‌పై ప్రభావం చూపిస్తుంది. కాగా.. రెపో రేటును వరుసగా మూడోసారి 6.5 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. 


Also Read: Bhola Shankar Ticket Price: భోళా శంకర్‌ టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఎందుకు రాలేదు..? అసలు కారణాలు ఇవే..!  


Also Read: RBI Penalty On Banks: ఈ నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఇందులో మీకు అకౌంట్ ఉందా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి