Megastar Chiranjeevi Bhola Shankar: భోళా శంకర్ సినిమా టిక్కెట్ ధరల పెంపునకు సంబంధించి వివిధ మీడియా సంస్థల్లో, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. టికెట్ల ధరలను పెంచకపోవడానికి అసలు కారణాలను వెల్లడించింది. నిబంధనల ప్రకారం నిర్ణయించిన 11 డాక్యుమెంట్లును భోళా శంకర్ ప్రొడ్యూసర్లు అందివ్వలేదని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్–ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ అడిగిన ముఖ్యమైన పత్రాలేవీ సమర్పించలేదని తెలిపింది. కేవలం ఈ కారణంగానే భోళా శంకర్ సినిమా టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి రాలేదని స్పష్టం చేసింది. అంతేతప్ప ఇందులో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదని పేర్కొంది.
భోళా శంకర్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యూనరేషన్ కాకుండా మూవీ నిర్మాణ ఖర్చు ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కలిపి రూ.100 కోట్లు దాటితే ప్రత్యేక రేట్లను అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ నెలలో మెమో జారీ చేసిన విషయం తెలిసిందే. భోళా శంకర్ సినిమా టిక్కెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాణ సంస్థ దరఖాస్తును పంపించిందని.. నిబంధనల ప్రకారం డాక్యుమెంట్లను అందివ్వలేదని ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ మూవీ మేకర్స్‌కు సమాచారం ఇచ్చింది. అయితే అందుకు సంబంధిత పత్రాలను, డాక్యుమెంట్లను నిర్మాణ సంస్థ సమర్పించకపోవడంతో టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి రాలేదు.
అదేవిధంగా ఏపీలో కనీసం 20 శాతం సినిమా చిత్రీకరణ జరపాల్సి ఉంది. వైజాగ్ పోర్టు సహా అరకు ప్రాంతాల్లో 25 రోజులపాటు చిత్రీకరణ జరిపినట్లు నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను జత చేయాల్సిందిగా కోరగా.. నిర్మాణ సంస్థ అందజేయలేదని ప్రభుత్వం తెలిపింది. మూవీ రిలీజ్‌కు ముందు సినిమా కోసం చేసిన ఖర్చుపై ఒక అఫిడవిట్ సమర్పించాల్సి ఉండగా.. ఇందుకు సంబంధించిన పత్రాలు ఏవీ అందజేయలేదని పేర్కొంది.
దీంతోపాటు ప్రత్యేక టిక్కెట్ ధరల పెంపునకు సంబంధించిన నిర్మాణ సంస్థ తన కార్యకలాపాల్లో భాగంగా నిర్వహించే 12 రకాల సాధారణ పత్రాలను జతచేయాలని సూచించగా.. ఈ డాక్యుమెంట్లు ఏవీ కూడా తమకు అందలేదని ప్రభుత్వం వెల్లడించింది. టికెట్ల రేట్లు పెంచేందుకు అనుమతి ఇవ్వకపోవడానికి అసలు కారణాలు ఇలా ఉంటే.. కొందరు కావాలని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Also Read: US Cyclone: అమెరికాను వణికిస్తున్న భారీ తుపాను, అంధకారంలో ఉత్తర అమెరికా రాష్ట్రాలు
Also Read: RBI Penalty On Banks: ఈ నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఇందులో మీకు అకౌంట్ ఉందా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి