Bank Strike 2023: బ్యాంక్ వినియోగదారులకు ముఖ్యగమనిక. రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నెల 30, 31వ తేదీల్లో సమ్మెకు వెళుతున్నట్లు ఇప్పటికే బ్యాంక్ యూనియన్ ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం, ఆదివారం రావడంతో మొత్తం నాలుగు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. బ్యాంకుల సమ్మె కారణంగా ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేయడం మొదలుకుని పలు సేవలకు ఆటకం కలిగే అవకాశం ఉంది. తిరిగి ఫిబ్రవరి 1న బ్యాంకులు ప్రారంభంకానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) రెండు రోజుల బ్యాంక్ సమ్మె కారణంగా.. పనితీరు ప్రభావితం కావచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు తెలియజేసింది. సమ్మె గురించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) సమాచారం ఇచ్చిందని వెల్లడించింది. తమ డిమాండ్లకు మద్దతుగా దేశవ్యాప్త సమ్మె చేయాలని బ్యాంకు సంస్థలు ప్రతిపాదించాయి. ఎస్‌బీఐ తమ శాఖలో వినియోగదారులకు ఇబ్బందులు ఏర్పడకుండా అవసరమైన ఏర్పాట్లను చేసింది. 


సమ్మె కారణంగా బ్యాంకుల పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. యూఎఫ్‌బీయూ సమావేశం ఇటీవల ముంబైలో జరగ్గా.. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సమ్మెకు వెళుతున్నట్లు ప్రకటించాయి. యునైటెడ్‌ ఫోరమ్‌ సమావేశంలో 2 రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు. 


ఇక నుంచి బ్యాంక్ పనిదినాలు 5 రోజులకు పరిమితం చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. దీంతో పాటు పింఛను కూడా అప్‌డేట్ చేయాలన్నారు. ఎన్‌పీఎస్‌ రద్దు చేసి జీతం పెంచేందుకు చర్చలు జరపాలన్నది ఉద్యోగులు కోరుతున్నారు. వీటన్నింటితో పాటు అన్ని కేడర్‌లలో నియామక ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్ కూడా ఉంది. ఈ డిమాండ్లన్నింటిపై సమ్మె చేయాలని యూనియన్ నిర్ణయించింది. 


Also Read: Sania Mirza: చెదిరిన సానియా మీర్జా కల.. కన్నీళ్లతో గ్రాండ్‌స్లామ్ ప్రయాణానికి వీడ్కోలు  


Also Read: PPF Calculator: పీపీఎఫ్‌లో భారీ ఆదాయం పొందాలనుకుంటున్నారా..? ఈ ట్రిక్‌ పాటిస్తే మీరు కోటీశ్వరులే..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook