Bank Holidays 2023: బ్యాంక్ వినియోగదారులకు ముఖ్యగమనిక. ఈ నెల చివరి వారంలో బ్యాంక్‌ సేవలు నిలిచిపోనున్నాయి. రెండు రోజుల పాటు సమ్మె చేయాలని బ్యాంక్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30, 31వ తేదీల్లో బ్యాంకులు సమ్మెకు వెళ్లనున్నాయి. అంతకుముందు నాలుగో శనివారం, ఆదివారం రావడంతో మొత్తం నాలుగు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. బ్యాంకుల సమ్మె కారణంగా ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేయడం మొదలుకుని పలు సేవలు అంతరాయం కలగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంక్ యూనియన్ జనవరి 30, 31వ తేదీలలో బ్యాంక్ సమ్మెను ప్రకటించింది. దీంతో పాటు జనవరి 28 నాల్గవ శనివారం సెలవు, జనవరి 29న ఆదివారం కారణంగా బ్యాంకులు క్లోజ్ కానున్నామి. మీకు ముఖ్యమైన పని ఉంటే ఈ నెల 27వ తేదీలోపు చేసుకోండి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26l బ్యాంకులకు పబ్లిక్ హాలీ డే.


యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) సమావేశం ముంబైలో జరిగింది. రెండు రోజుల పాటు సమ్మె చేయాలని బ్యాంకు యూనియన్లు నిర్ణయించాయి. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బ్యాంకు యూనియన్లు సమ్మెకు దిగుతున్నాయి. 


ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం మాట్లాడుతూ.. యునైటెడ్‌ ఫోరమ్‌ సమావేశంలో 2 రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 5 రోజుల పాటు బ్యాంకింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దీంతో పాటు పింఛను కూడా అప్‌డేట్ చేయాలన్నారు. ఎన్‌పీఎస్‌ రద్దు చేసి జీతం పెంచేందుకు చర్చలు జరపాలన్నది ఉద్యోగులు కోరుతున్నారు. వీటన్నింటితో పాటు అన్ని కేడర్‌లలో నియామక ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్ కూడా ఉంది. ఈ డిమాండ్లన్నింటిపై సమ్మె చేయాలని యూనియన్ నిర్ణయించింది. 


Also Read: Republic Day 2023: రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధం.. తొలిసారి పరేడ్‌లో ఆ విమానం  


Also Read: ICC Awards: ఐసీసీ టీ20 అత్యుత్తమ జట్టు ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురికి చోటు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి