Best 5 Seater Cars: 10 లక్షల రూపాయలకు లభించే బెస్ట్ 5 సీటర్ ఎస్‌యూవీ కార్లు ఇవే
Best 5 Seater Cars: దేశంలో 5 సీటర్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఇందులో సెడాన్ కార్ల కంటే ఎస్‌యూవీ కార్లపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. దూర ప్రయణాలు సైతం అలసట లేకుండా సౌకర్యవంతంగా ఉంటాయని ఎస్‌యూవీ కార్లను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో బెస్ట్ 5 సీటర్ కార్లు ఏవో తెలుసుకుందాం.
Best 5 Seater Cars: 5 సీటర్ బెస్ట్ కార్లు అనగానే బడ్జెట్ కూడా ఎక్కువే ఉండవచ్చు. అందులో ఎస్‌యూవీ అంటే మరీ ఎక్కువ. బడ్జెట్ మరీ ఎక్కువగా కాకుండా 10 లక్షల రూపాయల్లోపు ధరకు లభించే బెస్ట్ 5 సీటర్ కార్లు ఏవో తెలుసుకుందాం. వీటిలో టాటా కర్వ్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3 ఎక్స్‌వో కార్లు ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3 ఎక్స్‌వో. మహీంద్రా నుంచి గత ఏడాది లాంచ్ అయిన ఈ కారుకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ కారు వెయిటింగ్ పీరియడ్ 3-4 నెలలు ఉంది. మొదటి నెలలోనే ఏకంగా 10 వేల యూనిట్లు బుక్ అయ్యాయి. స్కైరూఫ్ ఫీచర్ అదనపు ఆకర్షణ. మహీంద్రా 3 ఎక్స్‌వో 16 కలర్ వేరియంట్లలో లభ్యమౌతోంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 7.49 లక్షల నుంచి ప్రారంభమౌతుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్. మారుతి సుజుకి లాంచ్ చేసిన లేటెస్ట్ మోడల్ కారు ఇది. 10 కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 1.0 లీటర్ల టర్బో బూస్టర్ జెట్ ఇంజన్, మోడర్న్ 1.2 లీటర్ కే సిరీస్ డ్యూయల్ జెట్ ఇంజన్ ఆప్షన్ ఉన్నాయి. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇందులో 9 ఇంచెస్ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ సిస్టమ్ ఉంది. 360 డిగ్రీస్ వ్యూ కెమేరా, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్ ఆప్ డిస్‌ప్లే ఉన్నాయి. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 8 లక్షల 37 వేల నుంచి ప్రారంభమౌతుంది.
టాటా కర్వ్. టాటా మోటార్స్ ఇటీవల లాంచ్ చేసిన సరికొత్త మోడల్ కారు ఇది. ఇందులో పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లతో పాటు ఎలక్ట్రిక్ మోడల్ కూడా అందుబాటులో ఉంది. మొత్తం 34 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఎక్స్ షోరూం ధర 9.99 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. డిజిటల్ స్టీరింగ్ వీల్, మల్టీ కలర్ మూడ్ లైటింగ్ ఫీచర్ ఉన్నాయి. సెక్యూరిటీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ అమర్చింది కంపెనీ. ఇక అన్నింటికంటే ముఖ్యంగా క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉంది.
Also read: Dussehra Holidays 2024: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల తేదీలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.