Kia Carens Vs Maruti Ertiga Which is Best..?: ప్రస్తుతం భారత దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మల్టీ పర్పస్ వెహికల్ మారుతి సుజుకి ఎర్టిగా. కానీ ఈ కారుకు కియా కేరెన్స్ మాత్రం దానికి గట్టి పోటీ ఇస్తోంది. ఫిబ్రవరి 2023లో, కియా కేరెన్స్ 6,248 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఒక రకంగా ఏ నంబర్ విక్రయాల పరంగా మారుతి సుజుకి ఎర్టిగాకు చాలా దగ్గరగా ఉందని అంటున్నారు, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం కేవలం 224 యూనిట్లు మాత్రమే అంటే ఎంత పోటాపోటీగా ఉందో పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 2023లో, ఎర్టిగా మొత్తం 6,472 యూనిట్లు అమ్ముడయియ్యాయి. దానికి దగ్గరగా  కియా కేరెన్స్ కూడా అమ్ముడవుతోంది. అయితే ఇది కేవలం ఫిబ్రవరిలో మాత్రమే కాదు,  కియా కేరెన్స్ కారు లాంచ్ అయినప్పటి ఉంచి బాగా అమ్ముడవుతోంది. దీంతో ఎర్టిగా తర్వాత రెండవ అత్యధికంగా అమ్ముడైన మల్టీ పర్పస్ వెహికల్గా మిగిలిపోయింది. అయితే, కియా కేరెన్స్ ఎర్టిగా కంటే ఖరీదైనది. మారుతి ఎర్టిగా ధర రూ.8.35 లక్షల నుంచి ప్రారంభం అవుతూ ఉండగా కియా కేరెన్స్ ధర మాత్రం రూ.10.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 


ఎర్టిగా దరిదాపుల్లో ఉన్న రేట్స్ లో దానికి ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్న వారికి కియా కేరెన్స్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. ఇక కియా కేరెన్స్ మూడు ఇంజన్ ఆప్షన్స్ తో వస్తుంది. అవి 1.5L NA పెట్రోల్ (115bhp పవర్), 1.4L టర్బో పెట్రోల్ (140bhp పవర్) అలాగే 1.5L డీజిల్ (115bhp పవర్). ఇక కియా కేరెన్స్ లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను డీఫాల్ట్ గా వచ్చేస్తుంది. అయితే 7-స్పీడ్ DCT ఆటోమేటిక్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లు కుడా ఆప్షన్ గా తీసుకోవచ్చు. ఇక కియా కేరెన్స్(పెట్రోల్)  కారు16.5kmpl మైలేజీని అందిస్తుంది. కియా కేరెన్స్ (డీజిల్) కారు 21.5kmpl మైలేజీని అందిస్తుంది. 


ఇక ప్రస్తుతం కియా కేరెన్స్ కోసం వెయిటింగ్ పీరియడ్ 12 వారాల వరకు ఉంది. కియా కేరెన్స్ మూడు ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుండగా ఎర్టిగాకు అదనంగా సీఎన్జీ(గ్యాస్) కిట్ ఆప్షన్ కూడా లభిస్తుంది, దీంతో ఎర్టిగా 26 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. ఎర్టిగా 1.5-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌తో సీఎన్జీ కిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో జనాలు ఎర్టిగాకు ప్రత్యామ్నాయంగా కెయిర్న్స్‌ను కొనుగోలు చేస్తున్నప్పటికీ, మైలేజ్ పరంగా ఎర్టిగా బెస్ట్ ఆప్షన్ గా ఉంది. 
Also Read: Tata Tiago Ev: దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు, 5 ఏళ్లలో 10 లక్షలు ఆదా, ఎలాగంటే


Also Read: Best Mileage SUV 2023: ధర తక్కువ, మైలేజీ ఎక్కువ.. ఈ సూపర్ 5 ఎస్‌యూవీలపై ఓ లుక్కేయండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook