Post Office Fixed Deposits: మీరు ఇన్వెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నారా..? స్టాక్ మార్కెట్ రిస్క్ గురించి భయపడున్నారా..? అయితే ఎలాంటి రిస్క్ లేని పోస్టాఫీసు స్కీమ్ గురించి తెలుసుకోండి. మంచి లాభాలతో పాటు పెట్టుబడి కూడా సురక్షితంగా ఉంటుంది. మీరు పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసులో FD (పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్) చేస్తే మీరు వడ్డీతో పాటు అనేక ఇతర సౌకర్యాలను పొందుతారు. లాభంతో పాటు ప్రభుత్వ గ్యారంటీ కూడా లభిస్తుంది. మీరు త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ (పోస్ట్ ఆఫీస్ FD వడ్డీ రేటు) సౌకర్యం పొందుతారు. మీరు ఒక సంవత్సరలంలో బ్యాంక్ కంటే ఎక్కువ లాభాలను పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం చాలా సులభం. పోస్టాఫీసులో వివిధ 1,2,3,5 సంవత్సరాలకు FD చేయవచ్చు. ఈ పథకంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. 


  • కేంద్ర ప్రభుత్వం మీకు పోస్టాఫీసు FDలో హామీ ఇస్తుంది.

  • ఇందులో మీ డబ్బు పూర్తిగా సురక్షితం.

  • ఇందులో ఆఫ్‌లైన్ (నగదు, చెక్) లేదా ఆన్‌లైన్ (నెట్ బ్యాంకింగ్ /మొబైల్ బ్యాంకింగ్) ద్వారా FD చేయవచ్చు.

  • మీకు కావాలంటే ఒకటి కంటే ఎక్కువ FDని కలిగి ఉండవచ్చు.

  • సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, ITR ఫైల్ చేస్తున్నప్పుడు మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

  • మీరు ఒక పోస్టాఫీసు నుంచి మరొక పోస్టాఫీసుకు సులభంగా FDని బదిలీ చేయవచ్చు. 


పోస్టాఫీసు FDని ఇలా తెరవండి..


పోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికి మీరు చెక్కు లేదా నగదు ఇవ్వడం ద్వారా ఖాతాను తెరవవచ్చు. ఇందులో ఖాతాలు కనిష్టంగా రూ.1000తో తెరవచ్చు. గరిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి పరిమితి లేదు. మీ సౌలభ్యం మేరకు మొత్తాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు.


లాభాలు ఏంటి..?


  • 7 రోజుల నుంచి ఒక సంవత్సరం FDపై 5.50 శాతం వడ్డీ లభిస్తుంది.

  • అదే వడ్డీ రేటు ఒక సంవత్సరం ఒక రోజు నుంచి 2 సంవత్సరాల FDలపై వర్తిస్తుంది.

  • మూడు సంవత్సరాల వరకు FDలపై 5.50 శాతం వడ్డీ కూడా లభిస్తుంది.

  • మూడు సంవత్సరాల ఒక రోజు నుంచి 5 సంవత్సరాల వరకు FDలపై 6.70 శాతం వడ్డీ లభిస్తుంది.


Also Read: Babar Azam: టీ20 ప్రపంచ కప్‌లో పాక్ ఓటమి.. బాబర్ ఆజామ్ సోదరుడికి నోటీసులు  


Also Read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు.. భారీగా పెరగనున్న జీతాలు..! 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి