PCB Notice to Babar Azam Cousin Kamran Akmal: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బంధువు, వరుసకు సోదరుడు, మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లీగల్ నోటీసు పంపింది. టీ20 ప్రపంచ కప్ సందర్భంగా తన యూట్యూబ్ ఛానెల్‌లో పాక జట్టు గురించి అతడు అవమానకర రీతిలో మాట్లాడాడు. అంతేకాకుండా అభ్యంతర వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో అక్మల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా లీగల్ నోటీసు పంపించారు.
కమ్రాన్ అక్మల్‌కు మాత్రమే కాకుండా షోయబ్ అక్తర్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి వెటరన్‌లతో సహా పలువురు పాకిస్థాన్ మాజీ క్రికెటర్లకు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ఈ సీనియర్ ఆటగాళ్ల టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై టీవీ ఛానెల్‌లు, యూట్యూబ్, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తీవ్రంగా విమర్శించారు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో భారత్, జింబాబ్వే చేతిలో పాక్ టీమ్ ఓడిపోగానే.. ప్రపంచ కప్ నుంచి తప్పుకోవడం ఖాయమంటూ అన్ని వైపులా నుంచి విమర్శలు వచ్చాయి. అయితే మళ్లీ పుంజుకుని ఫైనల్లో ఎంట్రీ ఇచ్చింది.
జింబాబ్వేపై ఓడిన తర్వాత పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీని వదులుకోవాలని బాబర్ ఆజమ్‌కు మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సలహా ఇచ్చాడు. కమ్రాన్ మీడియాలో తనపై అవమానకరమైన, తప్పుడు మరియు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని పీసీబీ ఛైర్మన్ అభిప్రాయపడ్డారు. అతను బాబర్‌కు సమీప బంధువు. వరుసకు సోదరుడు అవుతాడు. అయితే అక్మల్ చేసిన ఏ వ్యాఖ్య పీసీబీ చీఫ్‌ను బాధించింది అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. 40 ఏళ్ల కమ్రాన్ అక్మల్ తన కెరీర్‌లో 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లలో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లే దశ నుంచి ఏకంగా ఫైనల్ చేరింది పాకిస్థాన్ జట్టు. అయితే ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలై.. తృటిలో పొట్టి కప్పును చేజార్చుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టని ఇంగ్లాండ్.. రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను ఎగరేసుకుపోయింది.
Also Read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు.. భారీగా పెరగనున్న జీతాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి