Bikes under 40000: రూ. 40 వేలకే బెస్ట్ బైక్‌లు.. సూపర్ లుకింగ్! కొనడానికి ఇదే మంచి అవకాశం
Cheapest Second Hand Bikes Under 40000 in Hyderabad. మధ్యతరగతి ప్రజల కోసం కొన్ని సెకండ్ హ్యాండ్ బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు రూ.40,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Cheapest Second Hand Bikes Under 40000 in Hyderabad in OLX: భారతదేశంలో కార్ల కంటే ద్విచక్ర వాహనాలకు పెద్ద మార్కెట్ ఉంది. దేశంలో ప్రతి నెలా లక్షల బైక్‌లు అమ్ముడవుతుంటాయి. కళాశాల విద్యార్థి నుంచి ఉద్యోగం చేసే సామాన్య ప్రజల వరకు బైక్ ప్రయాణం చాలా సరసమైనదిగా ఉంటుంది. ఇక కార్లు వెళ్లలేని రద్దీ ప్రాంతాల్లో బైక్ ప్రయాణం చాలా సమయాన్ని తగ్గిస్తుంది. అయితే ఇప్పుడు బైకుల ఖరీదు కూడా లక్షలకు చేరింది. ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి వ్యక్తికి కొత్త బైక్ కొనడం చాలా కష్టంగా మారింది. అలాంటి వారు అస్సలు నిరాశపడాల్సిన అవసరం లేదు.
మధ్యతరగతి ప్రజల కోసం కొన్ని సెకండ్ హ్యాండ్ బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు రూ.40,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 20న ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీ 'ఓఎల్ఎక్స్' వెబ్‌సైట్‌లో రూ.40,000 కంటే తక్కువ ధరకు బైక్‌లు ఉన్నాయి. ఈ బైక్‌లు అన్ని ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులను విక్రయించే వేదికగా ఓఎల్ఎక్స్ అందరికీ సుపరిచితమే.
Hero glamour 2017:
ఇప్పటివరకు 23 వేల కిలోమీటర్లు ప్రయాణించిన 2017 మోడల్ హీరో గ్లామర్ బైక్.. ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి ఉంది. ఈ బైక్ ధర రూ.34 వేలు. ఈ బైక్ ఒక లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందట. ఈ బైక్ చూడ్డానికి చాలా బాగుంది. బైక్‌పై ఒక్క గీత కూడా లేదు. టైర్లు చాలా బాగా ఉన్నాయి.
Yamaha FZS:
ఇప్పటివరకు 29 వేల కిలోమీటర్లు తిరిగిన 2016 మోడల్ యమహా ఎఫ్‌జెడ్‌ఎస్ బైక్ ఓఎల్ఎక్స్‌లో ఉంది. ఈ బైక్ కోసం మీరు రూ.38 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇది ఢిల్లీలోని తిలక్ నగర్లో అమ్మకానికి ఉంది. ఈ బైక్ రంగు బ్లూ మరియు వైట్. బైక్ కండిషన్ బాగానే ఉంది. బైక్ నంబర్ DL 8Sతో స్టార్ట్ అవుతుంది.
Bajaj Pulsar 180:
ఇప్పటివరకు 19 వేల కిలోమీటర్ల రీడింగ్ ఉన్న 2016 మోడల్ బజాజ్ పల్సర్ బైక్ ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి ఉంది. ఈ బైక్ ధర రూ.45 వేలు. ఇది ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో అమ్మకానికి ఉంది. ఈ బైక్ మంచి కండీషన్‌లో ఉందని, ఫైనాన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
Also Read: బుసలు కొడుతున్న 20 అడుగుల కింగ్ కోబ్రా.. సింగిల్ హ్యాండ్‌తో పట్టేశాడు! మెంటలెక్కించే వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.