20 Feet Dangerous King Cobra: కింగ్ కోబ్రా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అత్యంత విషపూరితమైన, పొడవైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి. కింగ్ కోబ్రా కాటు వేస్తే 10 నిమిషాల్లో మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. భారీ ఏనుగు సైతం కింగ్ కోబ్రా కాటుకు నిమిషాల వ్యవధిలో చనిపోతుందంటే.. దాని విషం ఎంత ప్రమాదకరమైనదో అర్ధం చేసుకోవచ్చు. ఈ పాము ఒకేసారి ఎక్కువ విషంను చిమ్ముతుంది కాబట్టి మనిషి బ్రతకడు. అందుకే కింగ్ కోబ్రా పేరు చెపితేనే చాలా మంది హడలిపోతారు.
ఎంతో అనుభవం ఉన్నస్నేక్ క్యాచర్‌లు మాత్రమే కింగ్ కోబ్రాను ఒడిసి పట్టుకుంటారు. అయితే 15-20 అడుగుల కింగ్ కోబ్రాలు స్నేక్ క్యాచర్‌లకు కూడా మాములుగా చిక్కవు. బుసలు కొడుతూ మీదికి దూసుకొస్తాయి. కొందరు కింగ్ కోబ్రా కాటుకు గురైన స్నేక్ క్యాచర్‌లు కూడా ఉన్నారు. అందులకే భారీ సైజ్ కింగ్ కోబ్రాల విషయంలో స్నేక్ క్యాచర్‌లు కూడా కాస్త వెనకడుగు వేస్తారు. అయితే ఓ స్నేక్ క్యాచర్ మాత్రం 20 అడుగుల కింగ్ కోబ్రాను కూడా సింగిల్ హ్యాండ్‌తో పట్టేశాడు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం... ఇండోనేసియాలోని ఓ బైక్ రిపేర్ షాపులో 20 అడుగుల కింగ్ కోబ్రా దూరింది. ఇది చూసిన ఓనర్.. స్నేక్ క్యాచర్‌లకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు స్నేక్ క్యాచర్‌లు వచ్చి షాపులోకి వెళ్లారు. షాపు మొత్తం వెతకగా.. ఓ మూలాన పాము కనిపించింది. స్నేక్ స్టిక్ సాయంతో పామును సామాను నుంచి బయటికి తీసుకొచ్చారు. కింగ్ కోబ్రా సగం బయటికి రాగానే.. ఓ స్నేక్ క్యాచర్ దాని తోకను పట్టుకుని బయటికి లాగాడు. బయటికి వచ్చిన పాము పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్నేక్ క్యాచర్ గట్టిగా దాని తోకను పట్టుకున్నాడు. దాంతో అది బుసలు కొడుతూ మీదికి వచ్చింది. అయినా అతడు దాన్ని వదలలేదు.
కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ నెమ్మదిగా బయటికి తీసుకొచ్చాడు. పడగ విప్పిన పామును తన అనుభవంతో స్నేక్ క్యాచర్ కేవలం సింగిల్ హ్యాండ్‌తో తలను పట్టేశాడు. ఆపై మరో అతను నడుము పట్టుకుని సంచిలో బంధించాడు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోని 'Nick Wildlife' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పటివరకు 40,520 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
Also Read: Mars Transit 2023: కుజ సంచారం 2023.. ఈ 3 రాశుల వారికి తరగని ధనం! ఉద్యోగస్తులకు ప్రమోషన్
Also Read: Business Ideas 2023: రూ.15 వేలతో ప్రారంభించండి.. మూడు నెలల్లోనే రూ.4 లక్షలు సంపాదించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.