Best CNG Cars Under Rs 3 lakhs: ఇండియాలో పెట్రోల్, డీజీల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో పాటు వాహనాల నుంచి వెలువడే కాలుష్యానికి చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్న కేంద్రం.. డీజిల్ కార్లపై కఠినమైన ఆంక్షలు విధిస్తుండటంతో సీఎన్జీ కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే వీటికి అవసరమయ్యే సీఎన్జీ ఇంధనం ధర కొంత తక్కువే అయినప్పటికీ.. ఇతర కార్లతో పోల్చుకుంటే ఈ సీఎన్జీ కార్ల ధర కూడా భారీగానే ఉంది. ఏ కారు మోడల్ తీసుకున్నా.. పెట్రోల్ మోడల్ కంటే CNG వెర్షన్ కారుకు దాదాపు రూ. 1 లక్ష వరకు ఎక్కువే ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, ఎక్కువ ధర వెచ్చించి కొత్త సీఎన్జీ కారు కొనలేకపోతున్నామే అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లో ఎన్నో రకాల సెకండ్ హ్యాండ్ సీఎన్జీ కార్లు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. ఉదాహరణకు సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే కార్స్ 24 లో సీఎన్జీ కార్ల కోసం వెతికినప్పుడు కొన్ని ఆసక్తికరమైన రిజల్ట్స్ కనిపించాయి.


1) హ్యూందాయ్ ఐ10 స్పోర్ట్స్ మోడల్ కారు
2011 కి చెందిన సీఎన్జీ హ్యుందాయ్ i10 మోడల్ కారు కార్స్ 24 వెబ్‌సైట్‌లో రూ. 2.4 లక్షలకు అందుబాటులో ఉంది. యాష్ కలర్‌లో ఉన్న ఈ కారును విక్రయిస్తున్న వ్యక్తి దీనికి మొదటి యజమాని. UP-32 రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న ఈ మాన్యువల్ గేర్‌బాక్స్‌ కారుకు ఈ ఏడాది నవంబర్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కూడా ఉంది.


2. 2011 మారుతి స్విఫ్ట్ LXI మోడల్ కారు
2011  మోడల్‌కి చెందిన మారుతి సుజుకి స్విఫ్ట్‌ సీఎన్జీ కారు ఇప్పటివరకు 80,296 కి.మీ తిరిగింది. ఈ కారుకు రూ.2.68 లక్షలు ధర నిర్ణయించారు. తెలుపు రంగులో ఉన్న ఈ కారును అమ్ముతున్న వ్యక్తి ఈ కారుకు రెండో యజమాని. DL-5C తో రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది. స్విఫ్ట్ మోడల్లో సీఎన్జీ వెర్షన్ కోరుకునే వారికి.. అది కూడా సెకండ్ హ్యాండ్ కారునే కావాలనుకునే వారికి ఇది రైట్ ఛాయిస్.


3. 2016 మారుతి ఆల్టో 800 LXI మోడల్ కారు
2016 నాటి మారుతీ సుజుకి ఆల్టో 800 సీఎన్జీ మోడల్ కారు కార్స్ 24 లో రూ. 2.91 లక్షలకు అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ కారు 98,080 కి.మీ ప్రయాణించింది. నలుపు రంగులో ఉన్న ఈ కారును అమ్ముతున్న వ్యక్తి ఈ వాహనానికి మొదటి యజమాని. UP-32 రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉన్న ఈ కారు మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో రన్ అవుతుంది. 


4. 2016 హ్యుందాయ్ ఇయాన్ మాగ్నా ప్లస్ మోడల్ కారు
చిన్న ఫ్యామిలీకి సరిగ్గా సరిపోయే కారు హ్యుందాయ్ ఇయాన్‌. ఈ కారును సీఎన్జీ వెర్షన్‌లో కూడా కొనుగోలు చేయొచ్చు. ఇప్పటివరకు 78,758 కి.మీ తిరిగిన ఈ కారు ధర రూ.2.79 లక్షలుగా నిర్ణయించారు. 2016 మోడల్ కారు తెలుపు రంగులో ఉంది. రిజిస్ట్రేషన్ నంబర్ UP-14 పై కారు రిజిస్టర్ అయింది.