Best Mircro SUV Cars in India 2023: భారత దేశంలో ఎస్‌యూవీ కార్ల విక్రయాలు రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఎస్‌యూవీ కార్ల విక్రయాలను దృష్టిలో ఉంచుకుని అన్గాన్ని కంపెనీలు తక్కువ బడ్జెట్‌లో వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 'టాటా మోటార్స్' గత ఏడాది 'టాటా పంచ్' కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారుకు ప్రస్తుతం భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టాటా మోటార్స్ కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో 'టాటా పంచ్' రెండో స్థానంలో నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా పంచ్ కంటే చాలా కాలం ముందు భారత మార్కెట్లో మైక్రో ఎస్​యూవీ ఉంది. విశేషమేమిటంటే ఈ యూవీలో కూడా 6 మంది కూర్చోవచ్చు. అంతేకాదు దీని ధర కేవలం రూ.6.18 లక్షలు మాత్రమే. ఆ కారు మరేదో కాదు మహీంద్రా కేయూవీ 100 ఎన్‌ఎక్స్టీ (Mahindra KUV100 Nxt). ఈ కారు మహీంద్రాలో చౌకైన ఎస్​యూవీ కారు. మహీంద్రా కేయూవీ ధర రూ. 6.18 లక్షల నుంచి రూ. 7.84 లక్షల మధ్య ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ నుంచి ఫీచర్ల వరకు ఈ కారు టాటా పంచ్‌కి మంచి పోటీ ఇస్తోంది.


మహీంద్రా కంపెనీ మహీంద్రా కేయూవీ 100ని K2+, K4+, K6+ మరియు K8 అనే నాలుగు వేరియంట్‌లలో భారత మార్కెట్లో విక్రయిస్తోంది. ఇది 5 సీటర్ (2+3) మరియు 6 సీటర్ (3+3) ఎంపికలలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఎస్​యూవీ యొక్క 6 సీట్ల వేరియంట్‌లో ముందు భాగంలో 3 మంది కూర్చునే సౌకర్యం కూడా ఉంది. ఇందులో 1198cc 3 సిలిండర్, BS6 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 82bhp మరియు 114Nm టార్క్ ఇస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఇవ్వబడింది. ఇది ముందు భాగంలో డిస్క్ బ్రేక్ మరియు వెనుక డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. 


మహీంద్రా కేయూవీ 100 డిజైన్ పరంగా కూడా బాగుంది. అగ్రెసివ్ ఫ్రంట్ గ్రిల్, మస్కులర్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లు, మస్కులర్ బాడీ లైన్‌లు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED DRLలతో కూడిన డ్యూయల్-ఛాంబర్ హెడ్‌ల్యాంప్‌లు, బెజెల్ సరౌండ్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్స్ మరియు పవర్-ఫోల్డబుల్ ORVMలను పొందుతుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు USB కనెక్టివిటీనిఈ కారులో ఉంది. 


Also Read: Mercury Transit 2023: అరుదైన భద్రరాజ యోగం 2023.. ఈ 4 రాశుల వారు త్వరలో కుబేరులు అవ్వడం పక్కా!  


Also Read: డుకాటీ బైక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మార్కెట్లోకి 9 మోటార్‌సైకిళ్లు! ధర 10 లక్షల నుంచి మొదలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.