Post Office Schemes: పెట్టుబడులు, సేవింగ్ స్కీమ్స్ చాలా ఉంటాయి. కానీ 35 లక్షల లాభాన్ని ఆర్జించే సేవింగ్ పథకాల గురించి తెలుసా..ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త. ఒకవేళ మీరు పోస్ట్ ఆఫీసులో ఎక్కౌంట్ ఓపెన్ చేసుకునుంటే..లేదా ఏదైనా స్కీమ్ కోసం ఆలోచిస్తుంటే పోస్టాఫీసులో అద్భుతమైన పథకాలున్నాయి. ఇందులో ఏకంగా 35 లక్షలు లాభాల్ని ఆర్జించవచ్చు. ఆశ్యర్చపోవద్దు..నిజమే..


పోస్టాఫీసులో పెట్టుబడులు పెట్టేందుకు మంచి ఆప్షన్ ఇది. ఇందులో మీ డబ్బుకు పూర్తిగా గ్యారంటీ ఉంటుంది. పోస్టాఫీసు గ్రామ్ సురక్షా యోజన పథకమిది. ఇందులో భారీ లాభాలున్నాయి. పోస్టాఫీసు గ్రామ్ సురక్షా యోజన అనేది ఓ రకమైన భీమా పధకం. ఇందులో మీరు నెలకు కేవలం 15 వందల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఫలితంగా మీకు 35 లక్షల రూపాయలు లభిస్తాయి.


19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకూ ఎవరైనా సరే ఈ స్కీమ్ ప్రారంభించవచ్చు. ఈ పధకంలో కనీస భీమా మొత్తం 10 వేల రూపాయలు. అది కాకుండా అత్యధికంగా 10 లక్షల రూపాయలుంది. ఈ పధకంలో ప్రీమియం మొత్తాన్ని నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లింపు కోసం 30 రోజుల వ్యవధి కూడా ఉంటుంది. ఈ పథకంలో మీకు రుణ సౌకర్యం కూడా ఉంటుంది. ఇది కాకుండా లోన్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. పాలసీ తీసుకున్న 4 ఏళ్ల తరువాతే లోన్ తీసుకునే సౌకర్యం పొందవచ్చు.


ఒకవేళ 19 ఏళ్ల నుంచి పెట్టుబడి పెట్టి పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే..55 ఏళ్ల కోసం నెలవారీ ప్రీమియం 1515 రూపాయలు కాగా 58 ఏళ్లకైతే 1463 రూపాయలు, 60 ఏళ్లకైతే 1411 రూపాయలుంటుంది. 


55 ఏళ్ల కోసమైతే 31.60 లక్షల రూపాయలు మెచ్యూరిటీ బెనిఫిట్ లభిస్తుంది. 58 ఏళ్లకైతే 33.40 లక్షల రూపాయలు మెచ్యూరిటీ వస్తుంది. అదే 60 ఏళ్లకైతే 34.60 లక్షల రూపాయలు మెచ్యూరిటీ ఫండ్ లభిస్తుంది. ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో పాలసీని మధ్యలో సరెండర్ కూడా చేయవచ్చు. అయితే కనీసం మూడేళ్ల తరువాతే సరెండర్ చేసే అవకాశం ఉంటుంది. 


Also read: Fact Check: కేంద్రం 4 శాతం డీఏ పెంపు ప్రకటించిందా.. ఆ సర్క్యులర్‌లో నిజమెంత...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook