Buy Second Hand Honda City Cars under 3 lakhs only in Cars24: సెడాన్ కార్లలో 'హోండా సిటీ' పేరు మార్మోగిపోతోంది. చాలా సంవత్సరాలుగా వినియోగదారుల హృదయాలను హోండా సిటీ కొల్లగొడుతోంది. మంచి లుకింగ్, మైలేజ్ ఇచ్చే ఈ కారుకి ఇప్పటికీ భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కేవలం హోండా సిటీ షో రూమ్ కార్లకే కాదు.. సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ హోండా సిటీని కొనుగోలు చేయాలనుకుంటే.. చాలా తక్కువ ధరలో మీ ఇంటికి కారు వచ్చేస్తుంది. కార్స్ 24 వెబ్‌సైట్‌ ద్వారా దాదాపు రూ.3 లక్షలకే సెకండ్ హ్యాండ్ హోండా సిటీని కొనుగోలు చేయొచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2011 Honda City: 
2011 మోడల్ హోండా సిటీ కారు ధర కార్స్ 24 వెబ్‌సైట్‌లో రూ. 2.88 లక్షలుగా ఉంది. ఈ కారు రీడింగ్ 62,075 కిమీ. ఈ కారు పెట్రోల్ ఇంజిన్ కాగా.. DL-3C రిజిస్ట్రేషన్ నంబర్‌తో వస్తుంది. 


2012 Honda City 1.5L I-VTEC V MT:
2012 హోండా సిటీ కారు ధర కార్స్ 24 వెబ్‌సైట్‌లో రూ.4.12 లక్షలుగా ఉంది. ఈ కారులో పెట్రోల్ ఇంజన్‌ ఉండగా.. ఇప్పటివరకు 38501 కిమీ ప్రయాణించింది.ఈ  కారు రిజిస్ట్రేషన్ నంబర్ DL-4Cగా ఉండగా.. ఇన్సూరెన్స్ ఫిబ్రవరి 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది. 


2011 Honda City S MT:
2011 మోడల్ హోండా సిటీ ఇప్పటివరకు 30,564 కిమీ తిరిగింది. ఈ కారు పెట్రోల్ ఇంజిన్ లాగ.. DL-8C రిజిస్ట్రేషన్ నంబర్‌తో వస్తుంది. ఈ కారు ధర రూ.3.25 లక్షలుగా ఉంది. 


2012 Honda City:
కార్స్ 24 వెబ్‌సైట్‌లో 2012 హోండా సిటీ కారు ధర రూ.4 లక్షలు. ఇది పెట్రోల్ ఇంజన్‌ కాగా.. ఇప్పటివరకు 40,782 కిమీ ప్రయాణించింది. ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ DL-13 ఉండగా.. ఇన్సూరెన్స్ 2023 వరకు చెల్లుబాటులో ఉంటుంది. 


Also Read: Best Electric Scooter: సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగల్ ఛార్జింగ్‌తో 181 కిలోమీటర్లు! ఎగబడి కొంటున్న జనం


Also Read: Maruti Suzuki Cars Offers 2023: మారుతి కార్లపై బంపర్ ఆఫర్.. రూ.50,000 వరకు తగ్గింపు! 3 కార్లపై భారీ డిస్కౌంట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.