Maruti Suzuki Vitara Brezza Second Hand Cars Buy only Rs 3 Lakhs in Maruti Suzuki True Value: భారతదేశంలో సబ్-4-మీటర్ ఎస్‌యూవీ (Sub-4 Meter SUV)ల విభాగంకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ సెగ్మెంట్‌లోని ఎస్‌యూవీల (SUV Segment) విక్రయాలు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ కార్ సంస్థ మారుతి సుజుకి బ్రీజా ఎస్‌యూవీ (Maruti Brezza SUV)కి మంచి డిమాండ్ ఉంది. ఈ సంవత్సరం విడుదల అయిన మారుతి సుజుకి బ్రీజా ఫేస్‌లిఫ్ట్ మాదిరిగానే.. కంపెనీ మొదటిసారిగా విడుదల చేసిన బ్రీజా ఎస్‌యూవీ కూడా అమ్మకాల్లో దూసుకుపోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం బ్రీజా 2022 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కారుకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. ఈ కారు ధర సుమారు రూ. 8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ అయితే ధర మరింత పెరుగుతుంది. అయితే బ్రీజా 2022 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మీకు ఇష్టమై ఉండి.. మీ దగ్గర ఎక్కువగా డబ్బు లేకున్నా అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. 'మారుతి సుజుకి ట్రూ వాల్యూ' వెబ్‌సైట్‌లో అమ్మకానికి బోలెడు సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మకానికి ఉన్నాయి. వీటిలో కొన్నింటి ధర రూ.3.8 లక్షల నుంచి ప్రారంభం అవుతున్నాయి. 


Maruti Vitara Brezza VDI:
2017 మోడల్ మారుతి విటారా బ్రీజా వీడిఐ ధర రూ.380,000. ఈ కారు మొదటి యజమాని మొత్తం 254684 కిమీ ప్రయాణించాడు. ఇది మనేసర్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది డీజిల్ ఇంజన్ కారు.


Maruti Vitara Brezza LDI:
2018 మోడల్ మారుతి విటారా బ్రీజా ఎల్డీఐ రూ.490,000లకు అమ్మకానికి ఉంది. ఈ కారు మొత్తం 90795 కిమీలు నడిచింది. కోల్‌కతాలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది డీజిల్ ఇంజన్ కారు. ఈ కారుపై ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది.


Maruti Vitara Brezza LDI (O):
2016 మోడల్ మారుతి విటారా బ్రీజా ఎల్డీఐ (O) ధర రూ. 530,000. ఈ కారు మొదటి యజమాని 111947 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఈ కారు డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ కారు కురుక్షేత్రలో విక్రయానికి అందుబాటులో ఉంది.


Maruti Vitara Brezza ZDI:
2018 మోడల్ మారుతి విటారా బ్రీజా జెడ్డీఐ ధర రూ.550000లకు అమ్మకానికి ఉంది.. దీని మొదటి యజమాని  83588 కి.మీలు నడిపాడు. ఈ కారులో డీజిల్ ఇంజన్ ఉంది. ఈ కారు గోరఖ్‌పూర్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. 


Also Read: 7th Pay commission Latest News: ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అప్‌డేట్.. ఈ రోజునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు!  


Also Read: Dok-1 Max Cough Syrup: భారత దగ్గు మందుతో ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది పిల్లలు మృతి.. విచారణ ప్రారంభించిన డబ్ల్యూహెచ్ఓ!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.