Best Selling Electric Cars in India: జనం అంతా ఇప్పుడు పెట్రోల్ కార్లు, డీజిల్ కార్ల వినియోగం నుండి ఎలక్ట్రిక్ కార్ల వైపు షిఫ్ట్ అవుతున్నారు. కేంద్రం సైతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. పైగా టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా వంటి కార్ మేకింగ్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చాలా వేగంగా ముందుకు కదులుతున్నాయి. అంటే ఒక రకంగా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ కూడా పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు షిఫ్ట్ అవడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏయే కంపెనీలకు చెందిన ఏయే మోడల్ ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి అనేదానిపై ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా టియాగో :
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో టాటా మోటార్స్ అగ్రగామిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా మోటార్స్ నుండే ఎక్కువ రకాల మోడల్స్, వేరియంట్స్ ఉండగా అందులోనూ టాటా టియాగో ముందంజలో ఉంది. ఔను, టాటా మోటార్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఇండియన్ మార్కెట్లో టాటా మోటార్స్ ఇప్పటివరకు 5 లక్షల టాటా టియాగో కార్లు విక్రయించింది. 


టాటా నెక్సాన్ ఈవీ : 
ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా నెక్సాన్ ఈవి కారు రెండో స్థానంలో నిలిచింది. టాటా నెక్సాన్ ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 50,000 పైగా కార్లు ఇండియన్ మార్కెట్లో విక్రయించింది.


టాటా టిగోర్ ఈవి :
మనం ముందే చెప్పుకున్నట్టుగా ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో తొలి మూడు స్థానాలు టాటా మోటార్స్ సొంతం చేసుకుంది. ఈ జాబితాలో టాటా టిగోర్ ఈవి కారు మూడో స్థానం కైవసం చేసుకుంది. ఇప్పటివరకు 3,257 కి పైగా టాటా టిగోర్ కార్లు విక్రయించింది. 


మహింద్రా XUV 400 EV :
టాటా మోటార్స్ తరువాత మళ్లీ అగ్రెసివ్ గా దూసుకుపోతున్న కార్ల తయారీ కంపెనీల్లో మహింద్రా అండ్ మహింద్రా కూడా ముందుంది. మహింద్రా అండ్ మహింద్రా తయారు చేసిన మహింద్రా XUV 400 EV కారు ఇప్పటి వరకు 2234 కార్లు విక్రయించి ఈ జాబితాలో నాలుగో స్థానం సొంతం చేసుకుంది.


ఎంజీ జెడ్ ఎస్ ఈవీ : 
ఎంజీ జెడ్ ఎస్ ఈవీ .. ఇండియాలో ఎంజీ మోటార్స్ నుండి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే. 2019 లో ఎంజీ జెడ్ ఎస్ ఈవీ లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 10 వేలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి.


ఎంజీ కామెట్ EV :
మార్కెట్లోకి ఎంజీ కామెట్ EV ఆలస్యంగా వచ్చినప్పటికీ.. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో మాత్రం చోటు దక్కించుకుంది. లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటివరకు 1914 కార్లు విక్రయించింది. 


సిట్రోయెన్ eC3 కారు :
సిట్రోయెన్ eC3 కారు లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 576 కార్లను ఆ కంపెనీ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో విక్రయించింది. సిట్రోయెల్ కార్ల సేల్స్ తక్కువగా ఉండటానికి ఇండియన్ మార్కెట్‌కి సిట్రోయెన్ కొత్త కావడం ఒక కారణం అయితే, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్‌లో వెనుకబడటం మరో కారణం అనుకోవచ్చు.