Best EV Car: ఇండియాలో ఈవీ కార్లనగానే ముందుగా గుర్తొచ్చేది టాటా మోటార్స్. ఎలక్ట్రికల్ కార్ల రంగంలో టాటా మోటార్స్ దేశంలో అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. అందుకే అత్యధికంగా విక్రయమౌతున్న ఈవీ కార్లలో టాటా మోటార్స్ టాప్‌లో నిలుస్తోంది. టాటా నెక్సాన్ ఈవీ మొదటి స్థానంలో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కస్టమర్లను ఆకట్టుకునేందుకు, దేశంలోని ఈవీ మార్కెట్ క్యాప్చర్ చేసేందుకు దేశ విదేశీ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లు ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎంజీ మోటార్స్ కూడా దేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఎంజి కామెట్ ప్రవేశపెట్టింది. అదే సమయంలో మహీంద్రా కంపెనీ కూడా ఇటీవలే మహీంద్రా ఎస్‌యూవీ 400 ఈవీ వెర్షన్ లాంచ్ చేసింది. ఎస్‌యూవీ ఈవీ సెగ్మెంట్‌లో ప్రస్తుతం టాటా మోటార్స్ హవా కొనసాగుతోంది. టాటా మోటార్స్‌కు చెందిన టాటా నెక్సాన్ ఈవీ అత్యధికంగా విక్రయమౌతున్న ఈవీ కారుగా నిలిచింది. ఇప్పటి వరకూ టాటా నెక్సాన్ ఈవీ 50 వేల కార్లు విక్రయమయ్యాయి. టాటా నెక్సాన్ ఈవీ ప్రస్తుతం దేశంలోని 500కు పైగా పట్టణాల్లో అందుబాటులో ఉంది. టాటా నెక్సాన్ ఈవీ కస్టమర్లు కేవలం మూడేళ్లలో 50 వేలకు చేరుకున్నారు. టాటా నెక్సాన్ కార్ల మొత్తం విక్రయాల్లో ఈవీ వెర్షన్ 15 శాతం వాటా కలిగి ఉంది. 


టాటా నెక్సాన్ ఈవీ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఒకటి టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ కాగా రెండవది టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్. నెక్సాన్ ఈవీ ప్రైమ్‌లో 30.2 కిలోవాట్స్ పర్ హవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ అయితే 312 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారు ధర 14.49 లక్షల్నించి ప్రారంభమై 17.19 లక్షల వరకూ ఉంటుంది. ఇక నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌లో 40.5 కిలోవాట్స్ పర్ హవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ ఎక్కితే 453 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ధర 16.49 లక్షల నుంచి ప్రారంభమై 19.54 లక్షల వరకూ ఉంటుంది.


టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఫీచర్స్‌లో 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సింగిల్ ప్యాన్ సన్‌రూఫ్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, ఎయిర్ ప్యూరిఫయర్, వైర్‌లెస్ ఫోన్ చార్జర్ ఉంటాయి. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్ సైతం ఉన్నాయి. సేఫ్టీలో భాగంగా ఇందులో ఆల్ వీల్ డిస్క్ బ్రేక్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి.


టాటా నెక్సాన్ ఈవీ లుక్స్‌లో కూడా అద్దరగొడుతోంది. మార్కెట్‌లో ఏ ఇతర ఈవీ కారు కంటే అగ్రస్థానంలో నిలిచింది. టాటా మోటార్స్‌కు చెందిన ఇతర మోడల్ కార్లలో కూడా ఈవీ వెర్షన్‌ను కంపెనీ ప్రవేశపెడుతోంది.


Also read: Pan Aadhaar link: మీ పాన్ కార్డు-ఆధార్ కార్డు లింక్ ఫెయిల్ అవుతోందా, ఈ కారణాలు కావచ్చు చెక్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook