Pan Aadhaar link: మీ పాన్ కార్డు-ఆధార్ కార్డు లింక్ ఫెయిల్ అవుతోందా, ఈ కారణాలు కావచ్చు చెక్ చేసుకోండి

Pan Aadhaar link: పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసే గడువు ముగుస్తోంది. ఇప్పటికే చాలాసార్లు గడువు పొడిగించినా ఇంకా లక్షల్లో పాన్ కార్డులు మిగిలిపోయాయి. ఇప్పుడు చివరి నిమిషంలో పాన్ కార్డు-ఆధార్ కార్డుల అనుసంధానంలో ఆటంకం ఏర్పడుతోంది. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 27, 2023, 04:00 PM IST
Pan Aadhaar link: మీ పాన్ కార్డు-ఆధార్ కార్డు లింక్ ఫెయిల్ అవుతోందా, ఈ కారణాలు కావచ్చు చెక్ చేసుకోండి

Pan Aadhaar link: ఇన్‌కంటాక్స్ శాఖ పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఇన్‌కంటాక్స్ చట్టం 1961 ప్రకారం ప్రతి పాన్ కార్డు ఆ వ్యక్తి ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సిందే. ఇపుడీ లింకింగ్ ప్రక్రియకు చిట్ట చివరి గడువు తేదీ మరో మూడ్రోజుల్లో ముగియనుంది. చివరి నిమిషం కావడంతో అనుసంధాన ప్రక్రియలో ఎదురౌతున్న ఆటంకాలకు కారణమేంటో తెలుసుకుందాం..

ఇన్‌కంటాక్స్ శాఖ పాన్ కార్డు-ఆధార్ కార్డు రెండూ అనుసంధానం చేయమని గతంలోనే కోరింది. ఇప్పటికే పలుసార్లు గడువు పొడిగించింది. ప్రస్తుతం ఉన్న గడువు తేదీ జూన్ 30 అంటే మరో మూడ్రోజుల్లో ముగియనుంది. ఈ గడువు తేదీ కూడా 1000 రూపాయలు జరిమానాతో. జూన్ 30 తరువాత ఇకపై మీ పాన్ కార్డు పనిచేయదని ఇన్‌కంటాక్స్ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే చాలాసార్లు గడువు తేదీ పొడిగించడంతో ఇప్పుడు మరోసారి పొడిగించే పరిస్థితి కన్పించడం లేదు. ఇన్ని సార్లు గడువు పొడిగించినా ఇంకా ఆధార్ కార్డుతో అనుసంధానం కాని పాన్ కార్డులు లక్షల్లో ఉన్నాయని ఇన్‌కంటాక్స్ శాఖే చెబుతోంది. ఇప్పుడు చివరి నిమిషంలో అందరూ పాన్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొన్ని ఇబ్బందులు ఎదురై ఆ ప్రక్రియ పూర్తి కావడం లేదు. పాన్ కార్డు, ఆధార్ కార్డు లింకింగ్‌లో సమస్యలకు ఆదాయపు పన్ను శాఖ కొన్ని కారణాల్ని అంచనా వేస్తోంది. 

పాన్ కార్డు-ఆధార్ కార్డు లింకింగ్ కాకపోవడానికి చాలా కారణాలుండవచ్చని ముఖ్యంగా డెమోగ్రఫిక్ వివరాలు సరిగ్గా లేకపోతే అనుసంధానం కాదని ఇన్‌కంటాక్స్ శాఖ వివరించింది. ఇక పేరు, పుట్టిన తేదీ, జెండర్ విషయంలో తప్పులున్నా లింకింగ్ ఆగిపోతుంది. అందుకే పాన్ కార్డు-ఆధార్ కార్డు రెండింటినీ పరిశీలించుకుని ఏదో ఒక దాంట్లో మార్పులు చేసుకుని అప్పుడు లింకింగ్ చేసుకోవాలంటోంది. పాన్ కార్డులో మార్పులు చేర్పులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో చేసుకోవచ్చు. అదే ఆధార్ కార్డులో మార్పుల్ని సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి చేసుకోవాలి. అప్పటికీ లింక్ కాకపోతే పాన్ సర్వీసు కేంద్రాల్లో 50 రూపాయలు చెల్లించి బయోమెట్రిక్ అథెంటిఫికేషన్‌తో చేసుకోవాలి.

ఆదార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేయకపోతే జూలై 1 నుంచి పాన్ కార్డు నిరుపయోగమైపోతుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది. మరోసారి గడువు పొడిగించే పరిస్థితి కన్పించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు పొడిగించింది. 2023 ఫిబ్రవరి నాటికి 13 కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డులతో లింక్ కాలేదు. ఇప్పటికీ లక్షల్లో పాన్ కార్డులు..ఆధార్ కార్డులో లింక్ కాకుండా మిగిలిపోయాయి. పాన్ కార్డు - ఆధార్ కార్డు లింక్ కాకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం కష్టం. అయితే జూలై 31 వరకూ ఐటీ రిటర్న్స్ దాఖలుకు అవకాశమున్నందున పాన్ కార్డు-ఆధార్ కార్డు లింకింగ్ గడువు మరో నెల రోజులు పెంచవచ్చనే వాదన కూడా విన్పిస్తోంది. 

Also read: Higher Pension Updates: ఈపీఎఫ్ఓ శుభవార్త, హైయర్ పెన్షన్ కోసం దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News